ప్రతి ఒక్కరు ముఖం అందంగా,కాంతివంతంగా ఉండాలని కోరుకుంటారు.ముఖం ఆలా ఉండాలంటే చర్మంపై మృత కణాలు తొలగిపోవాలి.
ముఖంపై మృతకణాలు తొలగిపోతే ముఖంపై ఉన్న ఎన్నో సమస్యలు దూరం అవుతాయి.పంచదార మృత కణాలను తొలగించటంలో చాలా బాగా సహాయపడుతుంది.
పంచదారలో ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్ సమృద్ధిగా ఉండుట వలన చర్మ రంద్రాలను తెరుచుకొనేలా చేసి మృత కణాలను తొలగిస్తుంది.ఇప్పుడు పంచదారను ఉపయోగించి అందాన్ని ఎలా పెంచుకోవచ్చో తెలుసుకుందాం.
రెండు స్పూన్ల నిమ్మరసంలో మూడు స్పూన్ల తేనే,రెండు స్పూన్ల పంచదార కలిపి ముఖానికి పట్టించి 5 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసి సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
రెండు స్పూన్ల బాదం నూనెలో ఒక స్పూన్ పంచదార వేసి బాగా కలిపి ముఖానికి పట్టించి 5 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసి సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి.బాదo నూనెలో విటమిన్C సమృద్దిగా ఉండుట వలన చర్మ కణాలను రిపేర్ చేయటంలో సహాయపడుతుంది.
అరటిపండును పేస్ట్ గా చేసుకొని దానిలో కొంచెం పంచదార కలిపి మృదువైన పేస్ట్ గా తయారుచేసుకోవాలి.ఈ పేస్ట్ ని ముఖానికి పట్టించి 5 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసి సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి.
అరటిపండులో విటమిన్ A,B,C ఖనిజాలు ఉండుట వలన చర్మాన్ని హైడ్రేడ్ గా ఉంచుతుంది.
మూడు స్పూన్ల కొబ్బరినూనెలో రెండు స్పూన్ల తేనే,ఒక స్పూన్ పంచదార వేసి బాగా కలిపి ముఖానికి పట్టించి 5 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసి సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి.
కొబ్బరినూనె చర్మాన్ని తేమగా ఉంచడంలో, మృదువుగా నునుపుగా ఉంచడంలో సహాయపడుతుంది.