పవన్ కళ్యాణ్.రానా లు కలిసి నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
సాగర్ చంద్ర దర్శకత్వం లో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరన ముగింపు దశకు వచ్చింది.ఒక వైపు పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉంటూనే మరో వైపు సినిమా చిత్రీకరణ లో పాల్గొంటున్నాడు.
మీడియాలో ఈ సినిమా గురించి రెగ్యులర్ గా వార్తలు వస్తూనే ఉన్నాయి.తాజాగా మరోసారి సినిమాకు సంబంధించిన ఆసక్తికర ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అయితే ఈసారి వచ్చింది సినిమా స్టిల్ కాదు.ఇద్దరు హీరోలు కూడా షూటింగ్ గ్యాప్ లో అలా సేద తీరుతున్న సమయంలో తీసిన ఫొటో ఇది.పవన్ కళ్యాణ్ నులక మంచం మీద పడుకుని ఉండగా.రానా అటు పక్కన ఎడ్ల బండి ఉండగా దానిపై అలా వాలి ఉన్నాడు.
ఇద్దరు చాలా సింపుల్ గా అలా పడుకుని ఉండటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఇప్పటికే ఈ సినిమా పై జనాల్లో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.
అంచనాలకు తగ్గట్లుగా దర్శకుడు సాగర్ చంద్ర ఈ సినిమా ను భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నాడు.మలయాళ సినిమా కు రీమేక్ గా ఈ సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే.
ఒరిజినల్ వర్షన్ కు చాలా మార్పులు చేర్పులు చేసి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ సినిమాను మార్చి రాయడం జరిగింది.పెద్ద ఎత్తున అంచనాలున్న భీమ్లా నాయక్ సినిమా నుండి ఇప్పటికే వచ్చిన ప్రోమో మరియు పాటలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.
పవన్ కళ్యాణ్ కు జోడీగా నిత్యామీనన్ నటించింది.ఒక బిడ్డకు తల్లిగా నిత్యా మీనన్ నటించబోతుంది.భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమా ను వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.రికార్డు బ్రేకింగ్ వసూళ్లతో సంక్రాంతి విజేతగా ఈ సినిమా నిలుస్తుందేమో చూడాలి.
త్రివిక్రమ్ ఈ సినిమా కు వర్క్ చేయడం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుందనే నమ్మకం అందరిలో వ్యక్తం అవుతోంది.