పిల్లల్లో ప్రోటీన్ కొరత అనేది చాలా కామన్ గా కనిపిస్తుంటుంది.ప్రోటీన్ కొరత కారణంగా పిల్లలు ఎప్పుడూ నీరసంగా మరియు బలహీనంగా కనిపిస్తుంటారు.
చదువుల్లో, ఆటపాటల్లో చురుగ్గా పాల్గొనలేక పోతుంటారు.అలాగే కండరాల నొప్పి, విపరీతమైన ఆకలి లేదా ఆకలి లేకపోవడం, బరువు పెరగడం లేదా బాగా తగ్గిపోవడం వంటి లక్షణాలు సైతం పిల్లల్లో కనిపిస్తుంటాయి.
దాంతో పిల్లల్లో ఏర్పడిన ప్రోటీన్ కొరతను ఎలా నివారించాలో అర్థం కాక తీవ్రంగా సతమతం అవుతుంటారు.
అయితే ఇప్పుడు చెప్పబోయే పొడిని వారి డైట్ లో చేరిస్తే చాలా సులభంగా మరియు వేగంగా పిల్లల్లో ఏర్పడిన ప్రోటీన్ కొరతను తరిమికొట్టొచ్చు.
మరి ఇంతకీ పిల్లల్లో ప్రోటీన్ కొరతను పోగొట్టే ఆ పొడి ఏంటి.? దాన్ని ఎలా తయారు చేసుకోవాలి.? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో ఒక కప్పు వేరుశనగలను వేసి వేయించుకోవాలి.
ఇలా వేయించుకున్న వేరుశనగలను పొట్టు తొలగించి మెత్తగా పౌడర్ మాదిరి గ్రైండ్ చేసుకోవాలి.

ఆ తర్వాత అదే పాన్ లో ఒక కప్పు నువ్వులు వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి.ఇలా వేయించుకున్న నువ్వులను కూడా పొడి చేసుకోవాలి.ఇక చివరిగా పాన్ లో అరకప్పు కొబ్బరి పొడిని వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి.
ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో వేరుశనగల పొడి, నువ్వుల పొడి మరియు కొబ్బరి పొడి వేసుకొని కలుపుకోవాలి.ఫైనల్ గా ఒక కప్పు బెల్లం తురుము కూడా వేసి అన్నీ కలిసేంత వరకు స్పూన్ తో మిక్స్ చేసుకుంటే ప్రోటీన్ లోపాన్ని దూరం చేసే పొడి సిద్ధం అవుతుంది.
ఈ పొడిని ఒక డబ్బాలో నింపుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.ఈ పొడిని రోజుకు వన్ టేబుల్ స్పూన్ చొప్పున గోరువెచ్చని పాలలో కలిపి పిల్లల చేత తాగించాలి.
ప్రతిరోజు ఈ పొడిని పిల్లలకు ఇస్తే.వారి శరీరానికి కావాల్సిన ప్రోటీన్ లభిస్తుంది.
దీంతో పిల్లలు ఆరోగ్యంగా మారతారు.ఆటపాటల్లో చురుగ్గా పాల్గొంటారు.
నీరసం, బలహీనత వంటివి దూరం అవుతాయి.కండరాలు మరియు ఎముకలు దృఢంగా మారతాయి.
మానసిక ఎదుగుదల సైతం మెరుగ్గా సాగుతుంది.







