1.పవన్ కళ్యాణ్ పై మంత్రి గంగుల విమర్శలు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.అసలు పవన్ కళ్యాణ్ ఎవడు ఎక్కడ నుంచి వస్తున్నాడు అంటూ గంగుల ఫైర్ అయ్యాడు
2.వైసిపి పై అచ్చన్న విమర్శలు
దెబ్బ మీద దెబ్బతో వైసిపి తోచని స్థితిలో ఉందని , ఏపీ టిడిపి అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్న నాయుడు విమర్శించారు.
3.నారా లోకేష్ కామెంట్స్
ఒంగోలు మెడికల్ కాలేజీలో జరిగిన గంజాయి బ్యాచ్ దారుణాలపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు.మెడికల్ కాలేజీలు డ్రగ్స్ అడ్డాలుగా మారాయని, ఒంగోలు మెడికల్ కాలేజీలలో గంజాయి బ్యాచ్ల దాడులతో ఈ విషయం స్పష్టమైందని లోకేష్ అన్నారు.
4.కాంగ్రెస్ లో చేరిన దివ్యవాణి
ప్రముఖ నటి దివ్యవాణి కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఎఐసిసి ఇన్చార్జి మాణిక్ రావు ఠాక్రే సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.
5.కాంగ్రెస్ పై హరీష్ రావు విమర్శలు
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు మీటర్లు తప్పవని బీఆర్ఎస్ నేత మంత్రి హరీష్ రావు అన్నారు.
6.26 నుంచి నరసింహ దీక్షలు
నరసింహస్వామి దీక్షలకు సింహాచలం దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.ఈనెల 26 నుంచి జనవరి 6 వరకు 32 రోజులపాటు నరసింహ స్వామి దీక్షలు జరగనున్నాయి.
7.మంత్రి పువ్వాడ అజయ్ పై రేణుక విమర్శలు
మాజీ ఎంపీ రేణుక చౌదరి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.పువ్వాడ అజయ్ ఓటమి ఖాయమని, ఆయన దుర్మార్గుడు, దుష్టుడు అంటూ సంచలన విమర్శలు చేశారు.
8.తెలంగాణలో పోలింగ్ ఏర్పాట్లపై సిఇసి సమీక్ష
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ ఏర్పాట్లపై బుధవారం కేంద్ర ఎన్నికల కమిషన్ సమీక్ష చేయనుంది.
9.శ్రీ సత్యసాయి జిల్లాకు నేడు రాష్ట్రపతి రాక
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు శ్రీ సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి రానున్నారు.
10.నేడు వరంగల్ లో పవన్ కళ్యాణ్ పర్యటన
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం లో భాగంగా ఈరోజు రేపు రెండు రోజులు పాటు బిజెపి, జనసేన అభ్యర్థుల తరఫున తెలంగాణలో ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు.ఈ మేరకు ఈరోజు వరంగల్ నగరంలో పవన్ పర్యటించనున్నారు.
11.దుర్గమ్మను దర్శించుకున్న ఇంగ్లాండ్ క్రికెట్ టీం
ఇంగ్లాండ్ అండర్ 19 క్రికెట్ టీం విజయవాడలోని కనకదుర్గమును దర్శించుకున్నారు .వీరికి ఆలయ పండితులు వేద ఆశీర్వాదం అందించారు.
12.ప్రధాని మోదీ కామెంట్స్
రాజస్థాన్ లో అవినీతి నిర్మూలించేందుకు అశోక్ గహ్లోత్ ప్రభుత్వాన్ని సాగనంపాలని, కాంగ్రెస్ అబద్ధపు వాగ్దానాలను నమ్మవద్దని రాష్ట్ర ప్రజలను ప్రధాని నరేంద్ర మోడీ కోరారు.
13.చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా
ఇసుక కేసులు టిడిపి అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ మధ్యాహ్నం కు వాయిదా పడింది.
14.మాజీ క్రికెటర్ల ఇళ్ళల్లో ఈడి సోదాలు
మాజీ క్రికెటర్లు శివ లాల్ , హర్షద్ ఆయుబ్ ఇళ్లలో ఈడి సోధాలు చేపట్టింది .హెచ్సీఏ మాజీ అధ్యక్షుడు జి వినోద్ నివాసంలోను సోదాలు కొనసాగుతున్నాయి.
15.ఓటర్ల జాబితా తనిఖీ చేయించండి
వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచడంతోపాటు, ఓటర్లో జాబితాను తనిఖీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని టిడిపి ప్రతినిధి బృందం కోరింది.
16.కృష్ణ పై విద్యుత్ కేంద్రాల కేసు విచారణ వాయిదా
కృష్ణ పై ఉన్న జలవిద్యుత్ కేంద్రాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవో 34 ను కొట్టేసి ఆ కేంద్రాలను కృష్ణా నది యాజమాన్య మండలి అప్పగించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ వచ్చే నెల 12 కు వాయిదా పడింది.
17.మత్స్యకార కుటుంబాలకు 162 కోట్లు
మత్స్యకారుల సంక్షేమానికి వైసీపీ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని ఏపీ సీఎం జగన్ అన్నారు .మత్స్యకార కుటుంబాలకు 162 కోట్లను జగన్ విడుదల చేశారు.
18.ఇంటర్నెట్ లో భద్రాచలం ఉత్తర ద్వారా దర్శన టికెట్లు
వైకుంఠ ఏకాదశి మహోత్సవం సందర్భంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో డిసెంబర్ 23న ఉదయం 5 గంటలకు ఉత్తర ద్వార దర్శనం ఉంటుందని ఈవో రమాదేవి తెలిపారు.
19.గెలిపిస్తే మంత్రిగా తిరిగి వస్తా
తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే మంత్రిగా తిరిగి వస్తానని ములుగు కాంగ్రెస్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే సీతక్క ప్రజలను కోరారు.
20.అసదుద్దీన్ ఓవైసీ కామెంట్స్
కాంగ్రెస్ పార్టీ వల్లే కేంద్రంలో బిజెపి గెలుస్తూ వస్తుందని ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ విమర్శించారు.