ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు.పుష్ప సినిమాతో( Pushpa Movie ) ఈయన పాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపు పొందారు.
అయితే అల్లు అర్జున్ కెరియర్లో తనకు ఆర్య సినిమా( Arya Movie ) ఒక మైల్ స్టోన్ లాంటిది అని చెప్పాలి ఈ సినిమా గురించి ఎన్నో సందర్భాలలో అల్లు అర్జున్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.అయితే తాజాగా ఈ సినిమాని గుర్తు చేసుకుంటూ ఈయన సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.
సుకుమార్( Sukumar ) దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించినటువంటి చిత్రం ఆర్య ఈ సినిమా అప్పట్లో ఎలాంటి సంచలన విజయం అందుకుందో మనకు తెలిసిందే.ఇక ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ క్రేజ్ కూడా మారిపోయింది.అయితే ఈ సినిమా మే 7 వ తేదీ 2004 వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది అంటే ఈ సినిమా నేటికీ సరిగ్గా విడుదల 20 సంవత్సరాలను పూర్తి చేసుకుంది.
ఇలా ఈ సినిమా విడుదల అయ్యి 20 సంవత్సరాలు కావడంతో అల్లు అర్జున్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.ఆర్య సినిమాకు 20 సంవత్సరాలు.ఇది సినిమా మాత్రమే కాదు.
నా జీవితాన్ని మార్చేసిన క్షణమది.ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటాను స్వీట్ మెమోరీస్ అంటూ ఆర్య సినిమాకు సంబంధించిన కొన్ని స్టిల్స్ ఈయన ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ చేసినటువంటి ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.
ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రంగా ఆర్య 2( Arya 2 ) సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.ఇక పుష్ప సినిమాతో తనకు కెరియర్ ఇచ్చినటువంటి డైరెక్టర్ సుకుమార్ గారికి తాను ఎప్పుడు రుణపడి ఉంటాను అంటూ పలు సందర్భాలలో అల్లు అర్జున్ తెలిపారు.
అయితే ఆయన డైరెక్షన్ లోనే నటించిన పుష్ప సినిమాతో( Pushpa ) మరింత పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకోవటం విశేషం.అందుకే సుక్కుగారు లేకపోతే అల్లు అర్జున్ లేరు అంటూ పలు సందర్భాలలో ఈయన సుకుమార్ పై ప్రశంసలు కురిపించారు.