ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ( BRS Party ) ఓటమి చెందడం తో మరికొద్ది రోజుల్లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో( Parliament Elections ) 17 స్థానాలలో మెజారిటీ స్థానాలను తమ ఖాతాలో వేసుకోవాలనే ఆలోచనతో ఉంది బీఆర్ఎస్ పార్టీ .ఈ మేరకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు తదితరులు రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేస్తూ పార్టీ క్యాడర్ లో ఉత్సాహం నింపుతూ ప్రజలకు దగ్గరయ్యే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
అధికార పార్టీ కాంగ్రెస్, బిజెపిలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ, బీఆర్ఎస్ పై ప్రజలలో సానుకూలత పెంచే విధంగా బీఆర్ఎస్ అగ్ర నేతలు అంతా.ఎన్నికల ప్రచారంలో నిమగ్నం అయ్యారు.
ఎంపీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ బిజీగా గడుపుతున్నారు.
ఏ చిన్న అవకాశం దొరికినా వదిలి పెట్టకుండా ప్రత్యర్థులపై విమర్శలు చేస్తున్నారు.ఇక ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) ఈరోజు ఖైరతాబాద్ నియోజకవర్గంలో( Khairatabad Constituency ) రోడ్డు షో నిర్వహించనున్నారు.ఈ విషయాన్ని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి మన్నే గోవర్ధన్ రెడ్డి తెలిపారు.సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్( Padmarao Goud ) విజయాన్ని ఆకాంక్షిస్తూ ఈరోజు సాయంత్రం ఏడు గంటలకు షేక్ పేట్ , జూబ్లీహిల్స్ డివిజన్లలో, అలాగే ఫిలిం నగర్ లోని గౌతమ్ నగర్ స్క్వేర్ , బంజారా హిల్స్ , రోడ్ నెంబర్ 10 లో రాత్రి 7.30 గంటలకు, జహీరా నగర్ చౌరస్తా, బంజారాహిల్స్ ,
వెంకటేశ్వర కాలనీ , ఖైరతాబాద్, సోమాజిగూడ, హిమాయత్ నగర్ లో రోడ్డు షో , సభ నిర్వహించనున్నారు.ప్రతి రోజు రెండు మూడు రోడ్డు షోలలో పాల్గొంటూ బీఆర్ఎస్ వైపు ప్రజల దృష్టి పడే విధంగా ఆ పార్టీ అగ్ర నేతలు అంతా ప్రయత్నాలు చేస్తున్నారు.ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ వస్తున్నారు.
ఎన్నికల పోలింగ్ తేదీ సమయం దగ్గర పడటం ,మరికొద్ది రోజుల్లో ఎన్నికల ప్రచారం ముగియనుండడం తో ఉదయం నుంచి రాత్రి వరకు తీరిక లేకుండా ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులంతా నిమగ్నం అవుతున్నారు.