రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారికి ఇష్టమైన కోడెలకు వరి గడ్డిని రైతులు వితరణగా భక్తి భావంతో ఆలయ గోశాలకు అందజేశారు.ఆలయ గోశాల అధికారులు రైతులకు వరి వితరణకు సంబంధించిన రసీదుతో పాటు స్వామివారి లడ్డూ ప్రసాదం అందజేశారు.
ప్రతి సంవత్సరం గోశాలకు గడ్డి వితరణ చేస్తున్నట్లు రైతులు చెబుతున్నారు.స్వామివారి ఆశీస్సులతో పాడి పంట సమృద్ధిగా పండి అందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.