చిరంజివీ( Chiranjeevi ) చిన్న కూతురు శ్రీజ ( Sreeja ) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.శ్రీజ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో యాక్టివ్ కావడంతో పలు వ్యాపారాలలో సైతం పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే.
తాజాగా ఒక యువతి విడాకులకు( Divorce ) సంబంధించి అడిగిన ప్రశ్నను శ్రీజ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.
శ్రీజ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల ద్వారా చాలా సందర్భాల్లో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.
శ్రీజ, కళ్యాణ్ దేవ్ విడిగా ఉండటం గురించి సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే.ఈ జంటకు ఒక కూతురు కూడా ఉంది.
ఒక యువతి “నా భర్తకు విడాకులు ఇవ్వాలని ఉంది.కానీ నా భర్తే అడ్డు పడుతున్నారని తన మీద ప్రేమ ఉంటే విడాకులు ఇవ్వొద్దని కోరుతున్నారని ఇప్పుడేం చేయాలి” అని పోస్ట్ పెట్టారు.
ఆ యువతి ప్రశ్నకు సమాధానంగా కొంతమంది రియాక్ట్ అవుతూ ఆయనతో ఉంటే మీరు సంతోషంగా ఉంటారా లేదా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి అని పేర్కొన్నారు.మరి కొందరు నచ్చినట్టుగా జీవించాలని సెల్ఫ్ లవ్( Self Love ) అనేది ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.ఆ యువతి ప్రశ్నకు, సమాధానాలను శ్రీజ సోషల్ మీడియాలో షేర్ చేయడం ద్వారా వార్తల్లో నిలిచారు.
శ్రీజ తన వ్యక్తిగత జీవితాన్ని ప్రతిబింబించేలా ఆ యువతి పోస్ట్ ఉండటం వల్లే రియాక్ట్ అయ్యారని అంతకు మించి మరే కారణం లేదని నెటిజన్లు చెబుతున్నారు.శ్రీజ కెరీర్ పరంగా మరింత ఎదగాలని వ్యక్తిగత జీవితానికి సంబంధించిన చిన్నచిన్న సమస్యలు ఉంటే పరిష్కరించుకోవాలని నెటిజన్లు చెబుతున్నారు.శ్రీజకు కెరీర్ పరంగా చిరంజీవి నుంచి సపోర్ట్ లభించాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.