అన్ స్టాపబుల్ షోలో చరణ్ వేసుకున్న టీ షర్ట్ ధర ఎంతో తెలుసా… దిమ్మతిరిగి పోవాల్సిందే!

పాన్ ఇండియా స్టార్ హీరో రామ్ చరణ్( Ram Charan ) త్వరలోనే గేమ్ ఛేంజర్( Game Changer ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 10వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్లను వేగవంతం చేశారు.

ఈ క్రమంలోనే మొదటిసారి రామ్ చరణ్ బాలకృష్ణ( Balakrishna ) హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్( Unstoppable ) కార్యక్రమానికి హాజరయ్యారు.

ఇక ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోలు అలాగే ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

"""/" / ఇక ఈ కార్యక్రమంలో భాగంగా రాంచరణ్ ధరించిన టీషర్ట్( Ram Charan T-Shirt ) అందరి దృష్టిని ఆకర్షించింది.

ఈ కార్యక్రమానికి రామ్ చరణ్ బోన్స్ హూడీ ధరించారు.దీంతో రామ్ చరణ్ ధరించిన ఈ టీ షర్ట్ ధర ఎంత ఉంటుంది అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు.

అమిరి కంపెనీకి చెందిన లాంగ్‌స్లీవ్స్ కలిగిన టీషర్ట్ ఇది.దీని ధర అక్షరాల రూ.

1,35,722 అని తెలుస్తోంది.ఇలా రామ్ చరణ్ లక్షలు విలువచేసే టీషర్ట్ ధరించారని విషయం తెలిసి అభిమానులు షాక్ అవుతున్నారు.

అయితే సెలబ్రిటీలకు ఇలాంటి ఖరీదైన బ్రాండెడ్ దుస్తులు ధరించడం బ్రాండెడ్ వస్తువులను ఉపయోగించడం సర్వసాధారణం.

"""/" / ఇక గేమ్ ఛేంజర్ సినిమా విషయానికి వస్తే శంకర్ డైరెక్షన్ లో తెరకేక్కిన ఈ సినిమా ఇప్పటికీ విడుదల కావాల్సి ఉండగా షూటింగ్ ఆలస్యం కావడంతో వాయిదా పడుతూ జనవరి 10వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది.

ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం  నటించారు.అంజలి కియారా అద్వానీ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

రామ్ చరణ్ నటించిన RRR సినిమా తర్వాత ఈ చిత్రం విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.

మానవత్వం మంటగలిసింది.. శవం కాళ్లకు గుడ్డ కట్టి ఎలా ఈడ్చుకెళ్లారో చూస్తే..