టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కలిసి నటించిన తాజా చిత్రం.ఈ సినిమాకు దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహీంచగా, హీరోయిన్ ఛార్మి నిర్మాతగా వ్యవహరించిన విషయం తెలిసిందే.
కాగా ఈ సినిమా ఆగస్ట్ 25 న విడుదల కానున్న విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ పోస్టర్ లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.
కాగా ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని విజయ్ దేవరకొండ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.అయితే విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది.
ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కానుండడంతో చిత్ర బృందం ఎమోషన్స్ లో భాగంగా దేశాన్ని చుట్టోస్తోంది కాగా హీరో విజయ్ దేవరకొండ హీరోయిన్ అనన్య పాండే ఇప్పటికే పలు నగరాలను సందర్శించిన విషయం తెలిసిందే.ఇంకా కొన్ని ముఖ్య నగరాలను సందర్శించాల్సి ఉంది.
అయితే ఈ నేపథ్యంలోనే దేశంలోని పలు నగరాలను సందర్శిస్తున్న విజయ్ దేవరకొండ క్షేమంగా ఉండాలని అతని తల్లి పూజలు చేస్తోంది.ఇదే విషయాన్ని విజయ్ దేవరకొండ స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు.
దాదాపు ఈ నెల అంతా ఇండియాను చుట్టాల్సి ఉంది.

ఇప్పటికే మేము ఎన్నో నగరాలు తిరిగాము ఎంతో ప్రేమను పొందాము.కానీ అమ్మ మాకు రక్షణ అవసరమని భావించింది.కాబట్టి ఇంట్లో పూజ చేసి, మా అందరికీ తాయత్తులు కట్టింది.
ఇక మేము మా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నంతసేపు ఆమె ప్రశాంతంగా నిద్రపోతుంది అంటూ పూజకు సంబంధించిన ఫొటోలను షేర్ చేశాడు.ఇందులో విజయ్, అనన్య తాయత్తులు కట్టుకున్నట్లు తెలుస్తోంది.
అలాగే ఆ ఫోటో లలో విజయ్ మదర్ అనన్య కు విజయ్ కు తాయత్తులు కడుతోంది.







