ప్రస్తుతం చలికాలం ( Winter )నడుస్తున్న సంగతి తెలిసిందే.చలి పులి రోజురోజుకు విజృంభిస్తోంది.
అయితే మనలో చాలా మందికి చలిని తట్టుకునే సామర్థ్యం ఉండదు.దాంతో బయటికి రావాలంటేనే భయపడుతుంటారు.
మీరు కూడా ఈ చలికి వణికిపోతున్నారు.అయితే కచ్చితంగా ఇప్పుడు చెప్పబోయే సూపర్ డ్రింక్ ను మీరు మీ డైట్ లో చేర్చుకోవాల్సిందే.
ఈ డ్రింక్ చలికాలంలో శరీరానికి వెచ్చదనాన్ని అందిస్తుంది.చలిని తట్టుకునే సత్తువను చేకూరుస్తుంది.
అలాగే ఈ డ్రింక్ ను రోజూ తీసుకుంటే బరువు కూడా తగ్గుతారు.మరి ఆ సూపర్ డ్రింక్ ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా నాలుగు నుంచి ఆరు నల్ల మిరియాలను తీసుకుని మెత్తగా దంచుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకోవాలి.అలాగే దంచి పెట్టుకున్న మిరియాల పొడి ( Pepper powder )మరియు అంగుళం దాల్చిన చెక్కను ( Cinnamon )చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి.ఆపై కనీసం 15 నిమిషాల పాటు నీటిని మరిగించాలి.
వాటర్ పూర్తిగా కలర్ చేంజ్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకోవాలి.తద్వారా మన డ్రింక్ సిద్ధం అవుతుంది.
గోరువెచ్చగా అయిన తర్వాత ఈ డ్రింక్ ను నేరుగా సేవించాలి.రోజుకి ఒకసారి ఈ పానీయాన్ని తీసుకుంటే శరీరంలో హీట్ ప్రొడ్యూస్ అవుతుంది.చలిపులిని జయించే శక్తి లభిస్తుంది.అలాగే నల్ల మిరియాలు, దాల్చిన చెక్క వెయిట్ లాస్ కు తోడ్పడతాయి.అందువల్ల ఈ రెండు వేసి మరిగించిన వాటర్ ను తాగితే బరువు తగ్గుతాయి.అంతేకాదు ఈ డ్రింక్ ను తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి.
రక్తపోటు అదుపులో ఉంటుంది.జలుబు, దగ్గు వంటి సమస్యలు ఏమైనా ఉంటే దూరం అవుతాయి.
జీర్ణక్రియ మెరుగుపడుతుంది.రక్తంలో గ్లూకోజ్ స్థాయి మెరుగుపడుతుంది.
మధుమేహం సైతం అదుపులో ఉంటుంది.