దంతాల‌ను తెల్ల‌గా మెరిపించే ఉత్త‌మ‌మైన ఇంటి చిట్కాలు మీకోసం!

సాధార‌ణంగా కొంద‌రి దంతాలు ప‌సుపు రంగులో ఉంటాయి.ఎంత తోముకున్నా తెల్ల‌గా మెర‌వ‌నే మెర‌వ్వు.

 These Home Remedies Help To Get White Teeth! White Teeth, Home Remedies, Teeth,-TeluguStop.com

దాంతో ఏం చేయాలో అర్థం గాక అద‌నీ, ఇద‌నీ టూత్ పేస్ట్‌ల‌ను తెగ మార్చేస్తూ ఉంటారు.ఖ‌రీదైన టూత్ బ్రెష్‌ల‌ను యూజ్ చేస్తారు.

అయినా ఫ‌లితం లేకుంటే లోలోనే మ‌ద‌న ప‌డి పోతూ ఉంటారు.అయితే ఇప్పుడు చెప్ప‌బోయే ఉత్త‌మ‌మైన ఇంటి చిట్కాల‌ను పాటిస్తే గ‌నుక‌.

ఎంతటి గార పట్టిన పసుపు దంతాల‌నైనా ఇట్టే వ‌దిలించుకోవ‌చ్చు.మ‌రి దంతాల‌ను తెల్ల‌గా మెర‌పించే ఆ ఇంటి చిట్కాలు ఏంటో ఓ లుక్కేసేయండి.

ముందుగా కొన్ని మెంతుల‌ను తీసుకుని లైట్‌గా డ్రై రోస్ట్ చేసి మెత్త‌గా పొడి చేసి పెట్టుకోండి.ఉద‌యం లేవ‌గానే చిన్న గిన్నెలో అర స్పూన్ మెంతి పొడి, చిటికెడు ప‌సుపు, ఒక స్పూన్ రెగ్యుల‌ర్ వాడే టూత్ పేస్ట్ తీసుకుని క‌లిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మంతో రెండు నుంచి మూడు నిమిషాల పాటు స్మూత్‌గా దంతాల‌ను తోముకోవాలి.ఇలా చేస్తే గ‌నుక ప‌సుపు దంతాలు తెల్ల‌గా మిల మిలా మెర‌వ‌డం ఖాయం.

Telugu Tips, Healthy Teeth, Latest, Oral, Teeth, White Teeth, Yellow Teeth-Telug

అలాగే మ‌రో విధంగా కూడా దంతాల‌ను తెల్ల‌గా మార్చుకోవ‌చ్చు.అందు కోసం ఒక చిన్న గిన్నె తీసుకుని అందులో ఒర స్పూన్ బేకింగ్ సోడా, ఒక స్పూన్ హైడ్రోజన్ పెరాక్సైడ్ మ‌రియు మీరు రెగ్యుల‌ర్ టూత్ పేస్ట్ ఒక స్పూన్ వేసుకుని క‌లుపుకోవాలి.ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని యూజ్ చేసి దంతాల‌ను తోముకోవాలి.ఇలా చేసినా కూడా దంతాల‌కు ప‌ట్టిన ప‌సుపు గార వ‌దిలి పోయి.తెల్ల‌గా మార‌తాయి.

ఇక దంతాలు ఎల్ల‌ప్పుడూ తెల్ల‌గా, ఆరోగ్యంగా ఉండాలీ అంటే పైన చెప్పిన టిప్స్‌తో పాటు మ‌రికొన్ని జాగ్ర‌త్త‌లు కూడా తీసుకోవాలి.

ముఖ్యంగా ఫైబ‌ర్ ఫుడ్‌ను డైట్‌లో చేర్చుకోవాలి.ఆల్క‌హాల్‌, స్మోకింగ్ అల‌వాట్ల‌కు దూరంగా ఉండాలి.వారానికి రెండు సార్లు అయినా గోరు వెచ్చ‌టి నువ్వుల నూనెతో నోటిని పుక్క‌లించండి.మంచి ఆహారం తీసుకోండి.

త‌ద్వారా దంతాలు హెల్తీగా ఉంటాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube