బాహుబలి సినిమా వల్ల సంపాదించింది మొత్తం కోల్పోయాను.. ధనరాజ్ కామెంట్స్ వైరల్!

జబర్దస్త్( Jabardasth ) కార్యక్రమంలో కమెడియన్ గా నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో ధనరాజ్( Dhanraj ) ఒకరు.ఈయన కమెడియన్ గా మంచి సక్సెస్ అందుకొని అనంతరం సినిమా అవకాశాలను కూడా అందుకున్నారు.

 Dhanraj Sensational Comments On His Own Movie Details, Dhanraj, Sreemukhi, Bahub-TeluguStop.com

ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూ ఉన్నటువంటి ఈయన డైరెక్టర్ గా మారారు.అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ధనరాజ్ ఒక సినిమా కారణంగా తాను సంపాదించింది మొత్తం కోల్పోయానని తెలుపుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

తాను కమెడియన్ గాను అలాగే సినిమాలలో నటిస్తూ బాగా సంపాదించాను.అయితే ఈ సంపాదన మొత్తం తీసుకెళ్లి సినిమాలలో పెట్టానని తెలిపారు.తాను ధనలక్ష్మి తలుపు తడితే( Dhanalakshmi Thalupu Thadithe ) అని సినిమా చేశానని ఇందులో నాతో పాటు శ్రీముఖి( Sreemukhi ) కూడా నటించారని ధనరాజ్ వెల్లడించారు ఈ సినిమా కోసం సంపాదించినది మొత్తం ఖర్చు చేశాను.ఇక ఈ సినిమా బాహుబలి సినిమా( Bahubali ) విడుదలకు ఒక వారం ముందు విడుదలైంది.

ఈ సినిమా విడుదల సమయంలో నేను మరో సినిమా పని నిమిత్తం రాజస్థాన్ లో ఉన్నాను మొదటిరోజు థియేటర్లు ఏ మాత్రం ఖాళీ లేక హౌస్ ఫుల్ బోర్డులు పెట్టారు.ఇదే విషయం శ్రీముఖి నాతో చెప్పడంతో చాలా సంతోషమేసింది.అయితే మరుసటి రోజు థియేటర్లు మొత్తం ఖాళీగా కనిపించాయి.చాలామంది బాహుబలి సినిమా కోసం ఎదురు చూస్తూ థియేటర్ కు రాలేదు.పైగా థియేటర్లకు ముందుగానే కమిట్మెంట్స్ ఉంటాయి కనుక బాహుబలి సినిమా విడుదలకు ముందు మా సినిమాని పూర్తిగా తొలగించేశారు.దీంతో భారీగా నష్టాలు వచ్చాయని తెలిపారు.

ఇలా నష్టాలు వచ్చిన నా భార్య ఈ విషయంలో ఒక మాట కూడా తనని ప్రశ్నించలేదని అయితే అదే డబ్బు కనుక స్థలంపై పెట్టింటే ఈపాటికి తన ఆస్తులు రెట్టింపు అయ్యేదని ధనరాజ్ వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube