ఆ యూకే యూనివర్సిటీలో పోలీస్‌లు సర్‌ప్రైజ్ రైడ్.. కారణం తెలిస్తే..??

ఇటీవల మాంచెస్టర్‌( Manchester )లో నాటకీయ పరిస్థితులు వెలుగు చూసాయి.ఓ వ్యక్తి కత్తితో తిరుగుతున్నాడని ఒకరు ఫిర్యాదు చేశారు.

 Police Surprise Raid In That Uk University.. If You Know The Reason, Manchester-TeluguStop.com

ఎవరి ప్రాణాలు పోకముందే పోలీసులు యూనివర్సిటీని ముట్టడి చేశారు.చివరికి ఒక హాస్యాస్పదమైన నిజం బయటపడింది! సదరు వ్యక్తి కత్తితో తిరుగుతున్నాడని ఫిర్యాదు రావడంతో ఆదివారం మాంచెస్టర్ నగర కేంద్రంలో పోలీసులు భారీగా మొహరించారు.

ఒక పౌరుడు ఆ వ్యక్తి ఖడ్గంతో తిరుగుతుంటే చూసినట్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

పోలీసులు తుపాకీలతో మాంచెస్టర్ మెట్రోపాలిటన్ యూనివర్సిటీ( Manchester Metropolitan University )పై సర్‌ప్రైజ్ రైడ్ చేశారు.అనేక పోలీసు వాహనాలతో బయట నాటకీయ పరిస్థితులు కనిపించాయి.ఆరు పోలీసు బృందాలు థియేటర్‌కు చేరుకున్నాయి.

ఆపై పోలీసులు కత్తితో తిరుగుతున్న వ్యక్తి ఒక నిరాపరాధి అని గుర్తించి ఆశ్చర్యపోయారు.అధికారులు ఖడ్గంతో తిరుగుతున్న వ్యక్తి ఒక డ్రామా రిహార్సల్‌లో పాల్గొంటున్న విద్యార్థి మాత్రమేనని, అతని వద్ద ఉన్నది ఫేక్ ఖడ్గం అని తెలుసుకొని ఒకరి ముఖం ఒకరు చూసుకుని నవ్వుకున్నారు.

మొదట భయంతో కూడిన పరిస్థితులు నెలకొన్నప్పటికీ, పోలీసులు ఆ తర్వాత ఆ వ్యక్తి గురించి అపార్థం చేసుకోవడం జరిగిందని నిర్ధారించారు.ఫిర్యాదు చేసిన వ్యక్తికి థియేటర్‌లో డ్రామా రిహార్సల్ జరుగుతున్న విషయం తెలియదు.పోలీసులు, యూనివర్సిటీ భద్రతా సిబ్బంది కలిసి ఈ విషయంపై క్లారిటీ పొందారు.ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి.ఆక్స్‌ఫర్డ్ రోడ్, గ్రోస్‌వెనర్ స్ట్రీట్ జంక్షన్ వద్ద పోలీసులు యాక్షన్ సీన్ రేంజ్ లో బరిలోకి దిగడం చూడవచ్చు.గ్రేటర్ మాంచెస్టర్ పోలీసు అధికారి ఈ ఘటన గురించి మాట్లాడుతూ, “నగర కేంద్రంలో ఒక వ్యక్తి ఖడ్గంతో తిరుగుతున్నాడని ఫిర్యాదులు రావడంతో ఈ రోజు ఉదయం గ్రోస్‌వెనర్ స్ట్రీట్‌లోని ఒక భవనానికి సాయుధ పోలీసులను పంపించాం.

ఆ వ్యక్తిని గుర్తించిన తర్వాత, పోలీసులు ఆ ఖడ్గం డ్రామా ప్రయోజనాల కోసం రూపొందించిన ఒక చెక్క ఖడ్గమని తెలుసుకున్నారు.అంతటితో ఈ సమస్య సాల్వ్ అయిపోయింది.” అని తెలిపారు.గత కొన్ని నెలల్లో, యూకేలో అనేక కత్తి దాడుల ఘటనలు నమోదవడంతో పోలీసులు ప్రతి చిన్న ఫిర్యాదుపై సీరియస్‌గా వ్యవహరిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube