మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram Srinivas ) సక్సెస్ రేట్ దాదాపుగా 80 శాతం ఉంటుంది.త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలలో మెజారిటీ సినిమాలు ఇద్దరు హీరోయిన్లు ఉంటారు.
అయితే ఆ సినిమాలలో సెకండ్ హీరోయిన్ పాత్రలు చాలా వరకు సినిమాలకు, ఆయా హీరోయిన్ల కెరీర్ కు పెద్దగా ఉపయోగపడలేదు.జల్సా సినిమాలో పార్వతీ మెల్టన్,( Parvati Melton ) అత్తారింటికి దారేది సినిమాలో ప్రణీత,( Pranitha ) సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో నిత్యామీనన్( Nithya Menon ) రోల్స్ కు పెద్దగా ప్రాధాన్యత దక్కలేదు.
అ.ఆ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ అజ్ఞాతవాసి సినిమాలో అను ఇమ్మాన్యుయేల్,( Anu Emmanuel ) అరవింద సమేత వీర రాఘవ సినిమాలో ఈషా రెబ్బా,( Eesha Rebba ) అల వైకుంఠపురములో సినిమాలో నివేదా పేతురాజ్,( Nivetha Pethuraj ) గుంటూరు కారం సినిమాలో మీనాక్షి చౌదరి సెకండ్ హీరోయిన్ రోల్స్ లో నటించగా ఈ సినిమాలు ఆయా హీరోయిన్ల కెరీర్ కు మైనస్ అయ్యాయనే చెప్పాలి.
ఈ హీరోయిన్లలో అనుపమ, మీనాక్షి మినహా మిగతా హీరోయిన్లకు ఇప్పుడు ఎక్కువగా ఆఫర్లు కూడా లేవు.

త్రివిక్రమ్ సినిమాలో సెకండ్ హీరోయిన్ రోల్ లో( Second Heroine Role ) నటించడం ఆ హీరోయిన్ కెరీర్ కు మైనస్ అవుతుంది తప్ప ప్లస్ కాదని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.త్రివిక్రమ్ సినిమాలో ప్రాధాన్యత ఉంటే మాత్రమే సెకండ్ హీరోయిన్ రోల్ ను క్రియేట్ చేయాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.త్రివిక్రమ్ శ్రీనివాస్ తర్వాత సినిమా అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతుండటం గమనార్హం.

బన్నీ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా మరోసారి హిట్ సెంటిమెంట్ ను రిపీట్ చేయడంతో పాటు అటు బన్నీకి ఇటు త్రివిక్రమ్ కు భారీ బ్లాక్ బస్టర్ హిట్ దక్కడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఈ సినిమాను భారీ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.