6 నెలల్లో రెండు సినిమాలు అంటూ శంకర్ సంచలన ప్రకటన.. గేమ్ ఛేంజర్ లేదంటూ?

1996లో శంకర్( Shankar ) దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు చిత్రం ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే.సేనాపతి పాత్రలో కమల్ హాసన్ ఆహార్యం, నటన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

 Director Shankar Intresting Announcement Full Details Inside, Indian 2, Indian-TeluguStop.com

ఆ చిత్రానికి సీక్వెల్ గా భారతీయుడు 2 రూపొందుతున్న విషయం అందరికీ తెలిసిందే.లైకా ప్రొడక్షన్స్ రెడ్ జైయింట్ మూవీస్ బ్యానర్లు కలిపి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాయి.

Telugu Shankar, Game Changer, Indian, Ram Charan, Tollywood-Movie

అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన కొన్ని అప్డేట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.మూడో భాగంపై కూడా వార్తలు వస్తూ ఉండటంతో సినీ ప్రియులు సంబర పడుతున్నారు.పార్ట్ త్రి కి సంబంధించిన షూటింగ్ కూడా శంకర్ కంప్లీట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.ఆరు నెలలు రెండు సినిమాలు విడుదలవుతాయని శంకర్ చెప్పటం గమనార్హం.భారతీయుడు స్టోరీ చాలా పెద్దది.

Telugu Shankar, Game Changer, Indian, Ram Charan, Tollywood-Movie

దానిని మూడు గంటలలో చెప్పలేకపోయాము అందుకే అది రెండు పార్టీలుగా తయారయింది.జూలైలో భారతీయుడు టు రిలీజ్ అవుతుంది.అది రిలీజ్ అయిన ఆరు నెలలలో భారతీయుడు తిరిగి కూడా రిలీజ్ అవుతుంది అని చెప్పారు.

భారతీయుడు 2( Indian 2 ) ట్రైలర్ రిలీజ్ కోసం యూనిట్ ఒక భారీ ఈవెంట్ ని ప్లానింగ్ చేస్తోంది.ముందుగా ఈ సినిమాని జూన్లో రిలీజ్ చేయాలనుకున్నారు కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోవటంతో జూలై 12 కి వాయిదా వేసినట్లు తెలుస్తోంది .పార్ట్ 2 క్లైమాక్స్ లోనే మూడో భాగం ట్రైలర్ ని ప్రదర్శించాలని చూస్తూ ఉందట మూవీ టీం.అంతేకాకుండా భారతీయుడు 3 విడుదల తేదీని కూడా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇక కమల్ హాసన్ కూడా ఈ సినిమా పై తన స్పందన తెలియజేశారు.శంకర్ భారతీయుడు 2 స్టోరీని భారతీయుడు 3 స్టోరీ తో కలిపి చెప్పారు.

అందుకే సీక్వెల్లో నటించడానికి అంగీకరించాను అంటూ తను సీక్వెల్ చేయటానికి గల అసలైన కారణాన్ని తెలియజేశారు.అయితే శంకర్ గేమ్ చేజంర్ మూవీ గు( game changer movie )రించి మాట్లాడకపోవడంతో ఆ సినిమా విడుదల ఇప్పట్లో లేనట్టే అని నిరుత్సాహపడుతున్నారు మెగా ఫ్యాన్స్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube