ప్రతి సంవత్సరం, అమెరికా, భారతదేశ ప్రజలు తమ పొలాలు, పంటలను మిడతల దాడుల నుంచి రక్షించుకోవడానికి కృషి చేస్తారు.ఈ పురుగులు పంటలను తినడం లేదా దెబ్బతీయడం ద్వారా వాటిని నాశనం చేస్తాయి, దీని వలన భారీ ఆర్థిక నష్టాలు సంభవిస్తాయి.
అయితే, ఈ సంవత్సరం వాటిని వేరే రకంగా చంపే ఆలోచన వచ్చింది.అదే వాటిని వంట వండుకొని తినడం.
వంటల్లో ఎక్కువగా సికాడాస్ పురుగులు ( Cicadas )వాడుతున్నారు.సాధారణంగా జతకట్టే కాలంలో జోరుగా శబ్దం చేస్తాయి.
ఇప్పుడు చాలామందికి డిన్నర్ అవుతున్నాయి.సికాడా పురుగులను తెలుగులో ఈలకోడి పురుగు అని పిలుస్తారు.
ఈలల వలే ఇవి పెద్దగా శబ్దం చేస్తాయి కాబట్టి వాటికి ఆ పేరు వచ్చింది.

నిపుణులు సికాడాలను పోషకమైన ఆహార వనరుగా పరిగణిస్తారు.వీటిలో కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది మరియు ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది.వీటి గింజ లాంటి ఆకృతి వీటిని వివిధ వంటకాలకు అనుకూలంగా చేస్తుంది.
అమెరికాలో, ఆహార ప్రియులు సికాడాలతో ప్రయోగాలు చేస్తున్నారు.కొందరు వాటిని సలాడ్లలో లేదా బేకన్‌తో కలిపి తింటారు.
మరికొందరు వాటిని నేరుగా తింటారు.దక్షిణ కరోలినా( South Carolina )లో సికాడా-థీమ్‌తో కూడిన పార్టీ కూడా జరిగింది, అక్కడ ఈ పురుగులను బేకన్లో చుట్టి వడ్డించారు.

ఒహియో స్టేట్ యూనివర్శిటీ( Ohio State University ) మెడికల్ సెంటర్ మాజీ డైరెక్టర్ సికాడాలను సేకరించేటప్పుడు జాగ్రత్త వహించాలని సలహా ఇస్తున్నారు.రసాయనాలకు గురయ్యే అవకాశం ఉన్నందున, ఇంటి తోటల కంటే దూరంగా ఉన్న అడవుల నుంచి వాటిని సేకరించడం మంచిది.కొన్ని రెస్టారెంట్లు ఈ ధోరణిని అంగీకరిస్తున్నాయి.న్యూ ఓర్లీన్స్‌లోని “బగ్ అపెటైట్” రెస్టారెంట్ సికాడా సలాడ్, వేయించిన సికాడాలు టేస్టీగా చేస్తూ చాలామందిని ఆకట్టుకుంటుంది.అదే సమయంలో, ఫిలడెల్ఫియాలోని ఎల్ రే సికాడాలను బంగాళాదుంప సూప్‌తో కలిపి వడ్డిస్తుంది.ఈలకోడి పురుగులలో చాలా ప్రోటీన్ ఉంటుంది.
వాటిలో కేలరీలు, కార్బోహైడ్రేట్లు చాలా తక్కువగా ఉంటాయి.యాంటీఆక్సిడెంట్లు మాత్రం పుష్కలంగా ఉంటాయి.
ఈ పోషకాల కారణంగా ఈ పురుగులతో వండిన వంటకాలు బాగా పాపులర్ అవుతున్నాయి.ఈ సంవత్సరం అమెరికాలో దాదాపు ఒక ట్రిలియన్ ఈలకోడి పురుగులు నిద్ర నుంచి మేల్కొంటాయి.
ఇవి మిడ్వెస్ట్, ఆగ్నేయ ప్రాంతాలలోని 16 రాష్ట్రాలలో కనిపిస్తాయి.







