ఈ ఏడాది అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు( US Presidential Elections ) జరగనున్న సంగతి తెలిసిందే.ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్( President Joe Biden ) డెమొక్రాటిక్ పార్టీ నుంచి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌లు( Donald Trump ) అధికారికంగా వారి పార్టీల నుంచి నామినేషన్లు పొందారు.
ఎన్నికలకు ముందు అధ్యక్ష అభ్యర్ధుల మధ్య చర్చా కార్యక్రమాలు జరగడం అమెరికాలో సహజం.ఈ నేపథ్యంలో బైడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ట్రంప్‌తో అదనపు చర్చల గురించిన ఊహాగానాలకు ఆయన ప్రచార బృందం తెరదించింది.బైడెన్‌తో చర్చలకు ట్రంప్ టీమ్ అంగీకరించిన తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది.

మొదటి ప్రతిపాదన ఎన్‌బీసీ న్యూస్ , టెలిముండో డిబేట్‌కు .మరొకటి ఫాక్స్ న్యూస్ వీపీ డిబేట్( Fox News VP debate ) కోసం వచ్చాయి.బైడెన్‌పై ఎన్‌బీసీ, టెలిముండో హోస్ట్ చేయనున్న నాలుగో అధ్యక్ష చర్చకు తాను అంగీకరించినట్లుగా ట్రంప్ శుక్రవారం తన ట్రూత్ సోషల్‌లో పేర్కొన్నారు.వర్జీనియా స్టేట్ యూనివర్సిటీలో( Virginia State University ) వీపీ చర్చకు ఆతిథ్యం ఇవ్వడానికి ఫాక్స్ న్యూస్ ఆహ్వానాన్ని తాను అంగీకరించినట్లుగా ట్రంప్ చెప్పారు.
ఈ క్రమంలో ఎన్‌బీసీ న్యూస్‌తో బైడెన్ ప్రచార అధికారి మాట్లాడుతూ.డిబేట్ల గురించి చర్చ ముగిసిందని, ఇకపై ఆటలు వుండవని వ్యాఖ్యానించారు.

అయితే బైడెన్ బృందం ప్రకటనను ట్రంప్ ప్రచార ప్రతినిధి డేనియల్ అల్వారెజ్( Danielle Alvarez ) తప్పుబట్టారు.హిస్పానిక్ ఓటర్లు టెలిముండో/ఎన్‌బీసీని చూస్తారని ఆయన చెప్పారు.బైడెన్ సలహాదారులు అతని వినాశకరమైన రికార్డును కాపాడుకోవడానికి ఆయనను చర్చకు అనుమతించడానికి భయపడుతున్నారని డేనియల్ దుయ్యబట్టారు.ఈ వారం ప్రారంభంలో ట్రంప్, బైడెన్ రెండు అధ్యక్ష చర్చలలో ఒకరినొకరు ఎదుర్కొంటారని ప్రకటించారు.
ఒకటి జూన్ 27న అట్లాంటాలో సీఎన్ఎన్ ద్వారా.మరొకటి సెప్టెంబర్ 10న ఏబీసీ న్యూస్ ద్వారా జరగనున్నాయి.
ఇంతలో.తమ స్టూడియోలో డిబేట్‌ను చూసేందుకు ప్రేక్షకులను అనుమతించబోమని సీఎన్ఎన్ ప్రకటించడం దుమారం రేపింది.