ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధం అమెరికాను వణికిస్తోంది.ఇజ్రాయెల్, పాలస్తీనా అనుకూల నిరసనలతో గత కొన్నిరోజులుగా అగ్రరాజ్యం అట్టుడుకుతోంది.
ప్రధానంగా విశ్వవిద్యాలయాలు, కాలేజీలలో అల్లర్లు చోటు చేసుకుని, హింసాత్మకంగా మారుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నాయి.ఈ నేపథ్యంలో అమెరికాలో( America ) సంచలన సర్వే వెలుగులోకి వచ్చింది.
దేశంలోని క్యాంపస్‌లలో ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసనల మధ్య యూదు విద్యార్ధులు( Jewish Students ) భయాందోళనలకు గురవుతున్నారని సర్వే తెలిపింది.అంతేకాదు వీరిలో 40 శాతం మంది తమ యూదు గుర్తింపు, మతాన్ని దాచిపెడుతున్నారని పేర్కొంది.
‘‘హిల్లెల్ ఇంటర్నేషనల్ ’’( Hillel International ) అనే యూదు క్యాంపస్ సంస్థ అమెరికా వ్యాప్తంగా 310 మంది విద్యార్ధుల నుంచి అభిప్రాయ సేకరణ నిర్వహించింది.ఈ సందర్భంగా ప్రతి 10 మంది యూదు విద్యార్ధుల్లో నలుగురు తమ యూదు గుర్తింపును బహిర్గతం చేయడం లేదని తేలింది.32 శాతం మంది యూదు విద్యార్ధులు మతపరమైన కార్యక్రమాలకు హాజరుకావడానికి చాలా భయపడుతున్నాని సర్వే తెలిపింది.క్యాంపస్‌లలో ఇజ్రాయెల్( Israel ) వ్యతిరేక శిబిరాలు ఏర్పాటు చేయడంతో చదువుకోవడం ఇబ్బందిగా మారిందని ప్రతి 10 మందిలో ఆరుగురు చెప్పారు.42 శాతం మంది .ఈ నిరసనల తర్వాత తమ అధ్యాపకులపైనా నమ్మకాన్ని కోల్పోయినట్లుగా వెల్లడించారు.15 శాతం మంది తిరిగి తాము క్యాంపస్‌కు రావాలని కోరుకోవడం లేదన్నారు.
యూనివర్సిటీ నిర్వాహకులు.విద్యార్ధులను ఆదుకోవడానికి, స్నాతకోత్సవాలు సజావుగా జరిగేందుకు మరింత కృషి చేయాలని డిమాండ్ చేస్తూ దాఖలైన పిటిషన్ 32 వేలకు పైగా సంతకాలు పొందింది.స్నాతకోత్సవాలు రద్దు చేసిన వర్సిటీల్లో కొలంబియా, యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా ఉన్నాయి.
గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి తర్వాత దాదాపు 1600 క్యాంపస్ సెమిటిజం ఘటనలను సర్వే ట్రాక్ చేసింది.సెమిటిజం, అడ్డంకులు, ద్వేషం లేకుండా యూదు విద్యార్ధులు తమ విద్యను అభ్యసించడానికి అర్హులని హిల్లెల్ అధ్యక్షుడు, సీఈవో ఆడమ్ లెహ్మాన్ అన్నారు.