ప్రభాస్ కోసం నా చేతితో వంట చేసి తినిపించాలని ఉంది.. నటి సంచలన వ్యాఖ్యలు!

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి వారిలో నటుడు ప్రభాస్ ( Prabhas ) ఒకరు.ఈయన స్టార్ హీరోగా వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

 Payal Raj Puth Interesting Comments On Prabhas , Payal Raj Puth, Prabhas, Food,-TeluguStop.com

ఇక ప్రభాస్ మంచితనం గురించి ఆయన ఇచ్చే ఆతిథ్యం గురించి ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు ఎంతో గొప్పగా చెప్పిన సంగతి తెలిసిందే.ఇక ప్రభాస్ ఎవరికైనా కడుపునిండా వారికి ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలను స్వయంగా తన ఇంటి నుంచి చేయించి మరి తీసుకొస్తూ ఉంటారు.

ఇలా అందరి ఆకలి తీర్చే ప్రభాస్ ఆకలి తీర్చాలని ఉంది అంటూ తాజాగా నటి పాయల్ రాజ్ పుత్ ( Payal Rajputh ) చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఈమె ప్రభాస్ కి గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను ప్రభాస్ కి పెద్ద అభిమానిని తెలిపారు.తాను ఆదివారం మొత్తం ప్రభాస్ కోసం సమయం కేటాయిస్తానని ఆరోజు ప్రభాస్ కి స్వయంగా భోజనం తయారు చేసి తినిపించాలని కోరుకుంటానని వెల్లడించారు.ఆరోజు ప్రభాస్ ఏది అడిగితే అది స్వయంగా నేను నా చేతితో చేసి పెడతాను.

రాజ్మా రైస్ నా ఫేవరెట్ ఛాన్స్ వస్తే ప్రభాస్ కోసం ఆ ఫుడ్ స్వయంగా చేసి తినిపిస్తానని వెల్లడించారు.

ఈ విధంగా ప్రభాస్ కోసం ఏకంగా వంట చేసి ఆయనకు తినిపించాలని ఉందని ఈమె చేస్తున్నటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఈమె ప్రభాస్ కి ఇంత పెద్ద అభిమానా అంటూ ప్రభాస్ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.మరి నటి పాయల్ కి ప్రభాస్ అలాంటి ఛాన్స్ ఇస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ప్రభాస్ కల్కి( Kalki ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.ఈ సినిమా జూన్ 27వ తేదీ విడుదల కాబోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube