సినీ కెరియర్లో మొదటిసారి ఆ పని చేయబోతున్న బాలయ్య... ఏం చేస్తున్నాడో తెలుసా?

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి బాలకృష్ణ ( Balakrishna ) గత కొన్ని నెలలుగా సినిమా షూటింగ్ పనులకు విరామం ప్రకటించిన సంగతి తెలిసిందే.ఈయన ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో బిజీగా ఉన్న నేపథ్యంలో చిన్న బ్రేక్ ఇచ్చారు.

 Balakrishna First Time Fight With Lady Villan In Bobby Movie, Balakrishna, Shriy-TeluguStop.com

అయితే ఎన్నికలు పూర్తి కావడంతో తిరిగి బాలకృష్ణ తన సినిమా షూటింగ్ పనులలో బిజీ అయ్యారు.ప్రస్తుతం బాలయ్య బాబి ( Bobby ) డైరెక్షన్లో ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇంకా ఇప్పటివరకు ఈ సినిమాకు టైటిల్ కూడా ఖరారు చేయలేదు.ఈ సినిమా NBK 109 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పనులను జరుపుకుంటుంది.

ప్రస్తుతం ఈ సినిమాలో కొన్ని పవర్ ఫుల్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారని తెలుస్తుంది.ఇకపోతే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ సినిమాలో బాలకృష్ణ లేడీ విలన్ తో పోటీకి సై అంటున్నారని తెలుస్తుంది.పొగరు సలార్ వంటి సినిమాలతో లేడీ విలన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నటి శ్రియ రెడ్డి ( Shriya Reddy ) ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించబోతున్నారని సమాచారం.

ఇలా ఈ సినిమాలో శ్రీయ రెడ్డి ఏకంగా బాలయ్యతో పోటీ పడబోతున్నారని విషయం తెలియడంతో సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి ఇప్పటివరకు  పవర్‌ఫుల్‌ విలన్లతో ఢీకొట్టిన బాలయ్య  సినీ కెరియర్ లోనే మొదటిసారి లేడీ విలన్ తో ఢీకొట్టబోతున్నారని విషయం తెలియడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.ఇక త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి కీలక అప్డేట్ తెలియజేయనున్నారు.

భగవంత్ కేసరి సినిమా తర్వాత బాలయ్య ఈ సినిమాలో నటిస్తున్నటువంటి తరుణంలో సినిమాపై కూడా అంచనాలు పెరిగిపోయాయి అలాగే డైరెక్టర్ బాబీ సైతం వాల్తేరు వీరయ్య వంటి హిట్ సినిమా తర్వాత బాలయ్యతో సినిమాకు కమిట్ అవ్వడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube