కెరీర్ మొదట్లో సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన డైరెక్టర్ తేజ చిత్రం సినిమాతో దర్శకునిగా కెరీర్ ను ప్రారంభించారు.డైరెక్టర్ గా చిత్రం, జయం, నువ్వు నేను సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న తేజ ఆ తరువాత దర్శకత్వం వహించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేదు.
ఈ మధ్య కాలంలో తేజ దర్శకత్వం వహించిన నేనే రాజు నేనే మంత్రి మోస్తరు విజయాన్ని అందుకోగా గతేడాది తేజ దర్శకత్వంలో తెరకెక్కిన సీత సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది.
అయితే పలు సందర్బాల్లో వివాదాల ద్వారా వార్తల్లో నిలిచిన తేజ తాజాగా స్టార్ హీరోల పిల్లల గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
స్టార్ హీరోలు తమ పిల్లల జీవితాలను నాశనం చేస్తున్నారని ఆయన అన్నారు.చాలామంది స్టార్ హీరోలు తమ పిల్లలను బయటి ప్రపంచానికి పరిచయం చేస్తున్నారని.ఆయా స్టార్ హీరోలు చేస్తున్న అతిపెద్ద తప్పు ఇదేనని అన్నారు.స్టార్ హీరోల పిల్లలు బయట ప్రపంచానికి తెలియడం వల్ల వారి లైఫ్ డ్యామేజ్ అవుతుందని, భవిష్యత్తు రిస్క్ లో పడుతుందని అన్నారు.

స్టార్ హీరోల పిల్లలు పాఠశాలలకు వెళ్లే వయస్సులో వారి గురించి బయట ప్రపంచానికి ఎక్కువగా తెలిస్తే వారి ఎదుగుదలపై ప్రభావం పడుతుందని.నాటి తరం హీరోల పిల్లలు సినిమాల్లో ఎంట్రీ ద్వారా మాత్రమే ప్రేక్షకులకు పరిచయమయ్యే వారని.కానీ ప్రస్తుతం హీరోలు సోషల్ మీడియాలో తమ పిల్లలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తున్నారని పేర్కొన్నారు.పిల్లలు ఫేమస్ కావడం వల్ల స్టార్ హీరోల పిల్లలకు స్కూళ్లలో ఇతర పిల్లల వల్ల ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని తేజ అభిప్రాయపడ్డారు.
స్టార్ హీరోలు తమ పిల్లలను బయటి ప్రపంచానికి తెలియనివ్వకూడదని.వీలైనంత స్వేచ్ఛ ఇవ్వాలని సూచనలు చేశారు.స్టార్ హీరోలకు 25 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లే ఎక్కువగా అభిమానులుగా ఉంటారని హీరోల పెళ్లి, పిల్లల గురించి తెలిస్తే హీరోలకు ఫ్యాన్ బేస్ తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.తేజ స్టార్ హీరోల పిల్లల గురించి చేసిన కామెంట్లపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.