ప్రముఖ వ్యాపార వేత్త శర్వానంద్ హీరో గా తెరకెక్కిన ది లెజెండ్ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.50 ఏళ్ళ వయసులో అయన హీరో గా ఎంట్రీ ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచాడు.తన వ్యాపార సంస్థల యొక్క పబ్లిసిటీ ప్రోమో ల్లో సొంతం నటించడం తో చాలా కాలంగా హీరోగా నటించాలని కోరికతో ఉన్నాడు అని తెలుస్తుంది.ఆయన కోరిక జనాల మీద భారీగానే వేశాడు.
ఎలాగూ వందల కోట్ల ఆస్తులు ఉన్నాయి కనుక ది లెజెండ్ సినిమా ఏకంగా 65 కోట్ల రూపాయలతో నిర్మించాడు.ది లెజెండ్ సినిమా ను భారీ ఎత్తున పబ్లిసిటీ కూడా చేశాడు.
ఇది ఒక పాన్ ఇండియా సినిమా రేంజ్ లో విడుదల చేయడంతో కచ్చితంగా మ్యాటర్ ఉండి ఉంటుంది అని కొందరు భావించారు.
కానీ సినిమా సినిమా విడుదలైన తర్వాత మ్యాటర్ ఏమీ లేదని క్లారిటీ వచ్చేసింది, హైదరాబాద్లోని ప్రముఖ థియేటర్లో ఈ సినిమా రెండవ రోజు ఒక్క టికెట్ కూడా అమ్ముడు పోక పోవడం తో షో ను రద్దు చేశారు.
ఒక థియేటర్ లో కేవలం రెండే రెండు టికెట్లు అమ్ముడు పోయాయి.దాంతో అక్కడ కూడా షో ను రద్దు చేసినట్లుగా తెలుస్తోంది.
తమిళనాడు మరియు కర్ణాటక లో కూడా పరిస్థితి దారుణంగానే ఉంది.అక్కడ వసూళ్లు పెద్ద గా నమోదు అవ్వడం లేదని మీడియా మరియు ఇండస్ట్రీ వర్గాల వారు చెప్తున్నారు.60 కోట్ల సినిమా కు కనీసం ఆరు లక్షల షేర్ వచ్చినా కూడా గొప్ప విషయం అన్నట్లుగా ఉంది.60 కోట్ల సినిమా మరి ఇంత దారుణమైన ప్లాప్ ను మూట కట్టుకోవడం ఇండియన్ సినీ చరిత్ర లో ఎప్పుడూ లేదని ట్రేడ్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.