Mahesh Babu Guntur Kaaram : ఇక్కడే కాదు అక్కడ కూడా హిట్టే.. పాకిస్తాన్ లో మహేష్ బాబు క్రేజ్ మామూలుగా లేదుగా!

టాలీవుడ్ హీరో మహేష్ బాబు( Mahesh Babu ) గురించి మనందరికీ తెలిసిందే.మహేష్ బాబు ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు.

 Guntur Kaaram Huge Sucess In Pakisthan-TeluguStop.com

ఇక అందులో భాగంగానే మహేష్ ఇటీవలె గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ని తెచ్చుకుంది.

ఇకపోతే థియేటర్స్ లో ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది.కానీ ఓటిటిలో మాత్రం ఈ సినిమా ప్రేక్షకులను అల్లరిస్తూ దూసుకుపోతోంది.

Telugu Dumki, Guntur Kaaram, Mahesh Babu, Maheshbabu, Netflix, Pakistan, Tollywo

అయితే తెలుగు రాష్ట్రాలలో అంతంతమాత్రంగానే ఉన్న గుంటూరు కారం సినిమా( Guntur Kaaram ) పరిస్థితి పాకిస్థాన్ లో మాత్రం అంతకు పూర్తి విరుద్ధంగా ఉంది.అంటే ఒకరకంగా చెప్పాలంటే పాకిస్తానీల( Pakistan ) న‌షాలానికి గుంటూరు కారం అంటింది.ఈ కారం చాలా ఘాటుగా మ‌తి చెడేలా ఉంది అంటూ అక్కడ ప్ర‌జ‌లంతా సంబ‌రంగా చెప్పుకున్నారు.తెలుగులో దేశంలోని ఇత‌ర భాష‌ల్లో ఫ్లాపైనా కానీ, పాకిస్తానీల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంద‌ని తాజా ఓటీటీ చార్టులు చెబుతున్నాయి.

ఓటీటీలో రిలీజైన గుంటూరు కారం చిత్రాన్ని దాయాదులు ఐదు వారాల పాటు ఎగ‌బ‌డి చూసేయ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

Telugu Dumki, Guntur Kaaram, Mahesh Babu, Maheshbabu, Netflix, Pakistan, Tollywo

భారతదేశ ప్రాంతంలో నెట్‌ఫ్లిక్స్( Netflix ) టాప్ 10 సినిమాలలో అన్వేషిప్పిన్ కందెతుమ్ , మెర్రీ క్రిస్మస్ వంటి సినిమాలు అగ్రస్థానంలో నిలిచాయి.అయితే మహేష్ చిత్రం గుంటూరు కారం వరుసగా ఐదవ వారంలోను జాబితాలో నిలిచింది.భార‌త‌దేశంలో పెద్ద ఫెయిలైన ఈ చిత్రం పాకిస్తానీ ల‌కు బాగా న‌చ్చేయ‌డం ఆశ్చ‌ర్య‌పపోవాల్సిన విషయం.

ఈ చిత్రం బంగ్లాదేశ్ – పాకిస్తాన్ వీక్లీ చార్టులలో ఐదు వారాల ప్రదర్శనను కొనసాగించ‌డం ఆశ్చ‌ర్యంలోకి దించేసింది.కింగ్ ఖాన్ షారూఖ్‌ క‌థానాయ‌కుడుగా రాజ్ కుమార్ హిరాణీ తెర‌కెక్కించిన డంకీ( Dumki ) కూడా నెట్ ఫ్లిక్స్ లో దేశ విదేశాల్లో గొప్ప ఆద‌ర‌ణ ద‌క్కించుకుంది.

కాగా ప్రస్తుతం గుంటూరు కారం కి పాకిస్తాన్ లో వస్తున్న స్పందనను చూసి మహేష్ క్రేజ్ మామూలుగా లేదుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube