ప్రస్తుతం మన ఇండియా లో మోస్ట్ వాంటెడ్ టాప్ డైరెక్టర్స్ లిస్ట్ తీస్తే అందులో సందీప్ వంగ ముందు వరుసలో ఉంటాడు.చేసింది చాలా తక్కువ సినిమాలు, అయినా కూడా యూత్ ఆడియన్స్ లో ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసాడు.
ఇప్పటి వరకు ఆయన అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ మరియు అనిమల్ చిత్రాలు చేసాడు.కబీర్ సింగ్ అర్జున్ రెడ్డి చిత్రానికి రీమేక్, నార్త్ ఆడియన్స్ కి ఈ చిత్రం ఒక డ్రగ్ లాగ ఎక్కింది.
ఇక రీసెంట్ గా విడుదలైన ఎనిమల్ అయితే కబీర్ సింగ్ ని మించి యూత్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యింది.ప్రస్తుతం యూత్ ఆడియన్స్ కి ఎక్కువగా బోల్డ్ అడల్ట్ కంటెంట్ ఉన్నవే నచ్చుతున్నాయి.
అలా సందీప్ వంగ యూత్ ఆడియన్స్ పల్స్ ని పట్టుకోవడం తో నార్త్ ఇండియా లో రాజమౌళి ని మించిన బిగ్గెస్ట్ బ్రాండ్ అయ్యాడు.
ఇదంతా పక్కన సందీప్ వంగ అర్జున్ రెడ్డి చిత్రం కంటే ముందుగా నాగ చైతన్య తో ఒక సినిమా చెయ్యాల్సి ఉందట.
అర్జున్ రెడ్డి కంటే మోస్ట్ బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమా అట అది.కానీ ఒక పెద్ద కుటుంబానికి చెందిన వారసుడు హద్దులు దాటి బోల్డ్ కంటెంట్ లో నటిస్తే జనాలు తిడుతారేమో అనే భయం తో ఆ సినిమాని చెయ్యడానికి ఒప్పుకోలేదట.ఆ స్క్రిప్ట్ ని సందీప్ వంగ అలాగే పక్కన పెట్టి ఉన్నాడట.ఆ స్క్రిప్ట్ కేవలం నాగ చైతన్య కోసం మాత్రమే తయారు చేసిందని, వేరే హీరో కి ఆ కథ వాడను అని సందీప్ వంగ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పాడు.
అర్జున్ రెడ్డి చిత్రాన్ని కూడా ముందుగా విజయ్ దేవరకొండ తో చెయ్యాలని అనుకోలేదట.ప్రముఖ యంగ్ హీరో శర్వానంద్ తో ఈ చిత్రాన్ని చెయ్యాలని అనుకున్నాడట.

కానీ శర్వానంద్ ఒప్పుకోకపొయ్యేసరికి అప్పుడే పెళ్లి చూపులు సినిమాతో సూపర్ హిట్ ని అందుకున్న విజయ్ దేవరకొండ తో చేసాడట.విజయ్ కి ఈ చిత్రం ఏ రేంజ్ లో ఉపయోగపడిందో మనమంతా చూసాము.నాగ చైతన్య కోసం రాసుకున్న కథ కూడా ఆ రేంజ్ లో యూత్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే సినిమా అట.కానీ ఇప్పుడు సందీప్ వంగ రేంజ్ మారిపోయింది.ఇప్పటికే అల్లు అర్జున్, ప్రభాస్ మరియు రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు కమిట్ అయిపోయాడు.ఈ చిత్రాలన్నీ పూర్తి అయితే కానీ నాగ చైతన్య తో సినిమా సెట్స్ పైకి వచ్చే అవకాశం లేదు.