తెలుగు, తమిళ భాషల్లో నటిగా, సింగర్ గా పదుల సంఖ్యలో సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు శృతి హాసన్.శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన క్రాక్ సినిమా ఈ నెల 9వ తేదీన విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది.
రవితేజ, శృతి హాసన్, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో 2013లో బలుపు సినిమా విడుదలై హిట్ కాగా అదే కాంబినేషన్ లో తెరకెక్కిన క్రాక్ సినిమా కూడా హిట్ కావడం గమనార్హం.
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలు ఇస్తున్న శృతి హాసన్ సినిమాలోని కళ్యాణి పాత్ర గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
క్రాక్ సినిమాను చూసిన ప్రేక్షకులు సినిమాలోని శృతి పాత్ర లాంటి భార్య కావాలంటూ సోషల్ మీడియాలో అభిప్రాయపడటం తన దృష్టికి వచ్చిందని ఆమె అన్నారు.సగటు గృహిణిలా కనిపించే ఈ పాత్ర తనకు ఎంతగానో నచ్చిందని శృతిహాసన్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

కళ్యాణి పాత్ర పెళ్లై పిల్లలు ఉన్నా సొంత జీవితం గురించి చాటి చెప్పేలా, సాధించిన లక్ష్యాల గురించి వివరించేలా ఉంటుందని ఆమె అన్నారు.వకీల్ సాబ్ సినిమాలో కథపై ప్రభావం చూపే పాత్రలో నటిస్తున్నానని ఆమె అన్నారు.తన పాత్ర చిన్నదే అయినా కథపై ప్రభావం చూపిస్తుందని శృతి హాసన్ వెల్లడించారు. 2021 సంవత్సరంలో మంచి జరుగుతుందని తాను భావిస్తున్నానని పేర్కొన్నారు.
తెలుగులో వకీల్ సాబ్ సినిమా తరువాత తాను మరో సినిమాకు అంగీకరించలేదని శృతి తెలిపారు.నాలుగు నెలల కాలంలో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తనకు సంబంధించిన నాలుగు సినిమాలు విడుదల కానున్నాయని శృతి హాసన్ అన్నారు.
క్రాక్ సినిమా గతేడాది విడుదల కావాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల ఆలస్యమైందని శృతి హాసన్ పేర్కొన్నారు.