తెలుగులో నూతన దర్శకుడు బుచ్చిబాబు సాన “ఉప్పెన” అనే చిత్రానికి దర్శకత్వం వహించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా నూతన నటీనటులు మెగా హీరో వైష్ణవ్ తేజ్ మరియు కృతి శెట్టి నటించగా తమిళ ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి విలన్ గా నటించాడు.
ఈ చిత్రం నిన్నటి రోజున ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ దూసుకుపోతోంది.
అయితే తాజాగా ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన కృతి శెట్టి గురించి ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ హల్చల్ చేస్తోంది. అయితే ఇంతకీ ఆ వార్త ఏమిటంటే ఉప్పెన చిత్రంలో కృతి శెట్టి ని ఎంపిక చేయక ముందు మనీషా రాజ్ అనే యంగ్ హీరోయిన్ ని సెలక్ట్ చేశారని, కానీ పలు అనివార్య కారణాల వల్ల మనీషా రాజ్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించే లేకపోయిందని వార్తలు సోషల్ మీడియా మాధ్యమాలలో బలంగా వినిపిస్తున్నాయి.
దీంతో కొందరు నెటిజన్లు అసలు ఎవరు.? ఈ మనీషా రాజ్ అని తెగ వెతుకుతున్నారు.అయితే మనిషా రాజ్ 2017వ సంవత్సరంలో తెలుగులో ప్రముఖ హీరో మరియయు కమెడియన్ సునీల్ హీరోగా నటించిన “2 కంట్రీస్” అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది.కానీ ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోక పోవడంతో ఈ అమ్మడిని ఎవరూ గుర్తించలేదు.
ఈ విషయం ఇలా ఉండగా ఆ మధ్య ఉప్పెన చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొన్న దర్శకుడు బుచ్చిబాబు సాన తను చాలా మందిని ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర కోసం ఆడిషన్ చేశానని కానీ ఎవరూ నచ్చలేదని కేవలం కృతి శెట్టి మాత్రమే తమ అంచనాలకు తగ్గట్టుగా రాణిస్తుందనే నమ్మకంతో ఆమెను ఎంపిక చేశామని స్పష్టం చేశాడు.అంతేకాక షూటింగ్ ప్రారంభమయ్యాక కృతి శెట్టి చాలా హార్డ్ వర్క్ చేస్తూ తన పాత్రకి 100% శాతం న్యాయం చేసిందని అందుకు గాను ఆమెకు థాంక్స్ కూడా చెప్పాడు.