ప్రభాస్ బాహుబలిలో శివలింగాన్ని ఎత్తినప్పుడు ఔరా అని మనమందరం ఆశ్చర్యపోయాం.కాని అలా నిజజీవితంలో చేయడం మనకు సాధ్యం కాదని మనమందరం అనుకుంటాం.
కదా.అది గ్రాఫిక్స్ కాబట్టి ప్రభాస్ కి సాధ్యమైంది.నిజంగా బయట అంత బరువు ఉన్న దానిని మోయడం సాధ్యం కాదని మనమందరం గట్టిగా నమ్ముతాం కదా.కాని మీరిప్పుడు చూడబోయే ఓ వీడియోను చూస్తే అతనిని మరి బాహుబలి అంటారో, శక్తిమాన్ అంటారో మీ ఇష్టం.
ఇక అసలు విషయంలోకి వెళ్తే మనం బైక్ ను మామూలుగానే అప్పుడప్పుడు మోయలేక పోతాం.కాని ఓ వ్యక్తి తలపై భారీ బైక్ ను మోస్తూ బస్సు నిచ్చెన పైకి ఎక్కించాడు.
అసలు ఇది నమ్మడానికి కూడా సాధ్యం కాని ఈ పనిని ఏ తొణుకూ బెణుకూ లేకుండా తల మీద బైక్ ను మోస్తూ సులువుగా పని చేసాడు.ఈ ఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి నెట్టింట్లో విడుదల చేయడంతో ఈ వీడియో వైరల్ గా మారింది.
అసలు ఈ వీడియోను చూస్తున్న నెటిజన్లు ఆశ్చర్యపోవడం వారి వంతు అయింది.అసలు నమ్మడానికే సాధ్యం లేని ఈ వీడియోను చూడాలని మీకు ఆసక్తిగా ఉంది కదా.ఇంకెందుకు ఆలస్యం.మీరూ ఓ లుక్కేయండి.