మహానటి సావిత్రి పై సినిమా వచ్చిన తర్వాత ఎవరికి నచ్చింది వారు రాసుకున్నారు.జనాలు కూడా అలాగే నమ్మరు.
కొంత మంది సెలెబ్రిటీలు కూడా వారికి తోచింది వారు చెప్పారు.అవి కూడా చాల మంది సోషల్ మీడియాలో వైరల్ చేసారు.
వాస్తవానికి బయట జనాలకు తెలిసింది చాల తక్కువ.కానీ ఆమె కూతురు, కొడుకుకి మాత్రమే తెలుసు అక్కడ ఏమి జరిగిందో అని.ఒక పక్క డిగ్రీ చదువుతున్న కూతురు, మరో పక్క స్కూల్ కి వెళ్లే కొడుకు.వారు మాత్రమే సావిత్రి పక్కన ఉండేవారు.
సావిత్రి కుమార్తె చాముండేశ్వరి అప్పటికే వివాహం అయ్యింది, ఒక కొడుకు కూడా ఉన్నాడు.కానీ ఆమె భర్త డిగ్రీ అయినా లేకపోతే ఎలా చదువు చాల ముఖ్యం అని డిగ్రీ వరకు చదివించారు.
ఇక ఒక పక్క సావిత్రి మంచం పైన ఉన్న సమయంలో చాముండేశ్వరి డిగ్రీ పరీక్షలు రాస్తుంది.అలాంటి టైం లో చిన్న బాబు తో సావిత్రి ని చూసుకోవడం చాలా కష్టమయ్యిందట.
ఆ టైం లో సావిత్రి కొడుకు సతీష్ కూడా స్కూల్ కి వెళ్లకుండా అమ్మతోనే ఉండేవాడట.ఉన్నన్ని రోజులు పట్టించుకోకుండా కోమాలోకి వెళ్లిన తర్వాత మాత్రం జెమినీ గణేశన్ బాగానే పట్టించుకుంటారు అంటూ కూతురు చాముండేశ్వరి ఎప్పుడు చెప్తూనే ఉంది.
అయితే ఫారెన్ నుంచి కూడా డాక్టర్స్ ని రప్పించారట.అంతే కాదు జెమినీ కుటుంబంలో చాల మంది డాక్టర్స్ ఉన్నారు.

అంతే కాదు జెమినీ కూతుర్లు కూడా డాక్టర్స్ అందుకే ట్రీట్మెంట్ ఇంట్లో పెట్టుకొని మరి చేయించారు.ఇక హాస్పిటల్ లో ఉన్నప్పుడు చాల మంది ఆమె తోటి హీరోయిన్స్ వచ్చి చేసేవారట.ఇక చనిపోయిన తర్వాత ఎంతో ఘనం గా ఆమెను తన తోటి నటీనటులు వీడ్కోలు ఇచ్చారని, కానీ కొంత మంది అమ్మను ఆ దీన స్థితిలో చూడలేక చూస్తే ఆ బాధను తట్టుకోలేమని రాలేకపోయారని చెప్పారు చాముండేశ్వరి.

ఇక కొంత మంది ఫోన్స్ లో మాట్లాడేవారని కూడా తెలిపారు.అయితే అమ్మ కేవలం ముక్కు లో పైప్ తో శ్వాస తీసుకునేవారని, నోట్లో పైప్ తో జ్యూస్, టాబ్లెట్స్ కరిగించే పంపించేవారమని అలాగే 19 నెలలు ఉందని తెలిపారు.తమకు ఎవరి పైన ఎలాంటి కోపం లేదని, అమ్మ చాల పోగొట్టుకున్న, ఆమె పోయాక నాన్న మళ్లి శ్రద్ద తీసుకొని మాకు జీవింతాంతం తిన్న అయిపోని ప్రాపర్టీస్ ని వెనక్కి తెచ్చారని, అమ్మ వల్లనే మేమంతా హాయిగా ఉన్నామని తెలపడం నిజంగా విశేషం.