రోగుల పాలిట యముడిలా మారిన వైద్యుడు.. ఏం చేశాడో తెలిస్తే షాక్ అవుతారు.. ?

ప్రాణాలు కాపాడే వాడే వైద్యుడు అంటారు రోగాలు నయం చేసే వాడే డాక్టర్ అంటారు.మరి ఈ రెండు కాకుండా మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడేవారిని యముడు అంటారు కదా ప్రస్తుతం డాక్టర్ రూపంలో ఉన్న యముడు సోషల్ మీడియాకు చిక్కాడు.

 Nizamabad, Nishkal Prabhu, Neuro Multi Specialty Hospital, Doctor Spred, Corona,-TeluguStop.com

ఇకపోతే లోకం మొత్తం కరోనా అని మొత్తుకుంటూ డాక్టర్ల దగ్గరికి పరిగెడితే, ఆడాక్టరే కరోనా అంటిస్తే ఎలా ఉంటుంది చెప్పండి.ప్రస్తుతం ఇలాంటి ఘటనే నిజామాబాద్ లో వెలుగులోకి వచ్చింది.

ఆ వివరాలు చూస్తే.

నిజామాబాద్‌లో స్దానికంగా ఉండే నిష్కల్ ప్రభు అనే వైద్యుడు నిష్కల్ న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పేరుతో సొంత దవఖానాను నడిపిస్తున్నాడు.

కాగా గత కొద్దీ రోజుల క్రితం ఈ వైద్యుడికి కరోనా పాజిటివ్ వచ్చింది.ఈ విషయం బయట పొక్కకుండా దాచి రోజు హాస్పిటల్ కి వచ్చి రోగులకు వైద్యం అందిస్తున్నాడట.

ఈ క్రమంలో అనుమానం వచ్చిన కొందరు పేషెంట్స్ ఆరోగ్య అధికారులకు ఫిర్యాదు చేయగా, ఇతనికి కోవిడ్ టెస్ట్ చేయడానికి వారు వచ్చారట.అయితే ఆ టెస్ట్‌కు నిష్కల్ సహకరించక పోవడంతో ఆ అధికారులు బలవంతంగా కరోనా టెస్ట్ చేయగా పాజిటివ్ అని తేలిందట.

వెంటనే అప్రమత్తం అయిన అధికారులు ఈ వైద్య యముడు వైద్యం చేసిన రోగులకు, సిబ్బందికి టెస్ట్ చేయగా 30 మందిలో 10 మందికి కరోనా పాజిటివ్ అని తేలిందట.చూశారా ఈ డాక్టర్ నిర్వాకం.

అందుకే ప్రజల్లారా చివరికి హస్పటల్‌కు వెళ్లినా జాగ్రత్తగా ఉండమని ఈ ఘటన హెచ్చరిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube