చైనాలో( China ) ఓ పిల్లి చేసిన పనికి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.జియా యువాన్ టెంపుల్‌కి వచ్చే భక్తులకు ఈ పిల్లి హై-ఫైవ్ ఇస్తూ ఆశీర్వదిస్తోందట.
ఈ క్యూట్ వీడియో చూసిన నెటిజన్లు “వావ్” అంటున్నారు.ఈ పిల్లి( Cat ) పుణ్యం కోసం జనం గుంపులు గుంపులుగా టెంపుల్‌కి( Temple ) క్యూ కడుతున్నారు.
చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్‌లో సుజౌ( Suzhou ) అనే సిటీ ఉంది.అక్కడున్న జియా యువాన్ టెంపుల్‌లో ఈ పిల్లి ఉంటోంది.మెడలో బంగారు రంగు గొలుసు కూడా వేసుకుంది.ఎవరైనా దగ్గరికి వెళ్తే చాలు.
టక్కున చేయి చాచి హై-ఫైవ్ ఇస్తోంది.దీన్ని అందరూ ఆ పిల్లి ‘దీవెన’గా( Cat Blessing ) ఫీల్ అవుతున్నారు.
లక్కీ క్యాట్ అంటూ మురిసిపోతున్నారు.
ఈ పిల్లి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్( Viral ) అయ్యాయి.
దాని గ్రీటింగ్ స్టైల్ అందరికీ బాగా నచ్చేసింది.దీంతో టెంపుల్‌కి భక్తులు, టూరిస్టులు పోటెత్తుతున్నారు.
అందరికీ ఆ పిల్లితో హై-ఫైవ్ కొట్టించుకుని ‘దీవెన’ తీసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు.సుజౌ టూరిజం వాళ్ల అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఈ పిల్లి వీడియో షేర్ చేశారు.“పాజిటివ్ వైబ్స్ ఓన్లీ, జియా యువాన్ టెంపుల్‌లో ఈ పిల్లి హై-ఫైవ్స్‌తో దీవిస్తోంది, ఇంటర్నెట్ మాత్రం దీనికి పిచ్చెక్కిపోతోంది.” అని క్యాప్షన్ కూడా పెట్టారు.
జియా యువాన్ టెంపుల్‌ని వెస్ట్ గార్డెన్ టెంపుల్ అని కూడా అంటారు.ఇది యువాన్ డైనస్టీ టైంలో (1271-1368) కట్టారు.బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్, చైనీస్ గార్డెన్స్ కలగలిపి చాలా అందంగా ఉంటుంది ఈ టెంపుల్.ఇక్కడ చూడాల్సిన ప్లేసుల్లో అర్హత్ హాల్ ఒకటి.ఇక్కడ 500 బుద్ధ సన్యాసుల విగ్రహాలు ఉంటాయి.అవి కూడా మామూలు విగ్రహాలు కాదు.
చాలా శ్రద్ధగా చెక్కిన శిల్పాలు.రెండోది ఫ్రీ లైఫ్ పాండ్.
ఒకప్పుడు ఇక్కడ పెద్ద తాబేళ్లు ఉండేవి.
ఇంకా ఈ టెంపుల్‌లో చాలా పిల్లులు కూడా ఉంటాయి.అవి గుళ్లో, గార్డెన్స్‌లో హ్యాపీగా తిరుగుతూ ఉంటాయి.టెంపుల్‌కి వచ్చేవాళ్లతో ఫ్రెండ్లీగా మూవ్ అవుతాయి.
అందుకే ఈ టెంపుల్ జంతు ప్రేమికులకు, ఆధ్యాత్మికత కోరుకునేవాళ్లకు ఫేవరెట్ స్పాట్ అయిపోయింది.
ఇప్పుడు ఈ ఒక్క పిల్లి పుణ్యమా అని జియా యువాన్ టెంపుల్ ప్రపంచం దృష్టిలో పడింది.
జనాలు ఆ పిల్లితో హై-ఫైవ్ కొట్టించుకుని ‘దీవెన’ తీసుకోవడానికి క్యూలు కడుతున్నారు.