కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చి అతి తక్కువ సమయంలోనే నేషనల్ క్రష్ గా గుర్తింపు పొందిన రష్మిక ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న రష్మిక త్వరలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో నటించిన మిషన్ మజ్ను సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఈమె ఎంతో బిజీగా ఉన్నారు.ఈ సినిమా జనవరి 20 వ తేదీ నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది.
ఇక ఈమె ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్న నేపథ్యంలో బాలీవుడ్ క్రిటిక్ గా పేరుపొందిన కేఆర్ కే నటి రష్మికపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.గతంలో ఈమె ఫేస్ బాలీవుడ్ కి సెట్ కాదని ఈమె భోజ్ పురికి మాత్రమే సెట్ అవుతుందని ఈమె గురించి చేసినటువంటి పోస్ట్ పెద్ద ఎత్తున వైరల్ అయింది.
అయితే తాజాగా సంచలనమైన ట్వీట్ చేస్తూ పనిలో పనిగా విజయ్ దేవరకొండ లైగర్ సినిమా ఫ్లాప్ గురించి కూడా ఎగతాళి చేశారు.

ఈ సందర్భంగా కె ఆర్ కె స్పందిస్తూ.మేడం రష్మిక మందన్న జీ మా హిందీ ప్రేక్షకులు మీ బాయ్ ఫ్రెండ్ అనకొండ(విజయ్ దేవరకొండ) లైగర్ సినిమానీ రిజెక్ట్ చేసి ఆయనను బాలీవుడ్ నుంచి ఎలా అయితే తరిమి కొట్టారో సరిగా మీకు కూడా అదే పరిస్థితి ఎదురవుతుంది.మిమ్మల్ని హిందీ సినిమాలలో కన్నా భోజ్ పురి సినిమాలలో చూడటం ఆనందంగా ఉంది అంటూ కామెంట్ చేశారు.

అయితే విజయ్ దేవరకొండకు పట్టిన గతి నీకు పడుతుంది అంటూ ఈయన చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విజయ్ రష్మిక అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.ముందు నీ సంగతి నువ్వు చూసుకో తర్వాత ఇతరుల గురించి ఆలోచించు అంటూ పెద్ద ఎత్తున తనపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.







