కాకినాడ జిల్లా అన్నవరంలోని శ్రీ సత్యదేవుని ఆలయంలో భక్తులకు డ్రెస్ కోడ్ అమలులోకి వచ్చింది.ఈ క్రమంలో దేవస్థానంలో పూజలు, నిత్య కళ్యాణం, వ్రతాలు వంటి పూజా కార్యక్రమాల్లో పాల్గొనే భక్తులు తప్పనిసరిగా సంప్రదాయ వస్త్రధారణలోనే రావాలని ఆలయ అధికారులు తెలిపారు.
2019 నుంచి ఈ దేవస్థానంలో డ్రెస్ కోడ్ ఉన్నా సరిగా అమలు చేయలేదు.తాజాగా మళ్లీ డ్రెస్ కోడ్ అమల్లోకి వచ్చింది.
ఈ నేపథ్యంలో పురుషులు పంచె, కండువా లేదా కుర్తా పైజమా, మహిళలు అయితే చీర, కుర్తా పైజమా ధరించాలని వెల్లడించారు.