అలోవెరా జెల్ లో ఇవి కలిపి తలకు రాశారంటే జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరగడం గ్యారంటీ!!

జుట్టు రాలడం అనేది దాదాపు అందరూ ఎదుర్కొనే అత్యంత సర్వసాధారణమైన సమస్య.అయితే జుట్టు రాలడాన్ని నిరోధించడానికి కొన్ని కొన్ని హెయిర్ ప్యాక్స్ చాలా బాగా సహాయ పడతాయి.

 This Simple Home Remedy Helps To Stop Hair Fall And Improve Hair Growth! Simple-TeluguStop.com

కానీ బిజీ లైఫ్ స్టైల్ కారణంగా హెయిర్‌ ఫ్యాక్స్ వేసుకునేంత సమయం కొందరికి ఉండకపోవచ్చు.అలాంటివారికి ఇప్పుడు చెప్పబోయే రెమెడీ చాలా బాగా సహాయపడుతుంది.

ఈ రెమెడీ సింపుల్ గా ఉన్నా కూడా వెరీ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.ఈ రెమెడీని పాటిస్తే జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరగడం గ్యారంటీ.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్( Aloe vera gel ) వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్( Coconut oil ), వన్ టేబుల్ స్పూన్ ఆముదం( castor oil ), వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్( Vitamin E oil ), వన్ టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ వేసుకొని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.రెండు నిమిషాల పాటు కలిపిన తర్వాత ఆ మిశ్రమాన్ని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి అప్లై చేసుకోవాలి.

గంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒక్కసారి ఈ సింపుల్ రెమెడీని పాటిస్తే మంచి ఫలితాలు పొందుతారు.ముఖ్యంగా అలోవెరా జెల్, కోకోనట్ ఆయిల్, ఆముదం, విటమిన్ ఇ ఆయిల్ మ‌రియు బాదం ఆయిల్ జుట్టుకు చక్కని పోషణ అందిస్తాయి.మూలాల నుంచి జుట్టును బలోపేతం చేస్తాయి.

జుట్టు రాలడాన్ని సమర్థవంతంగా అరికడతాయి.అదే సమయంలో జుట్టు ఎదుగుదలను ప్రోత్సహిస్తాయి.

హెయిర్ ఫాల్ తో బాధపడుతున్న వారు ఈ సింపుల్ రెమెడీని కనుక పాటిస్తే జుట్టు రాలడం కంట్రోల్ అవ్వడమే కాకుండా ఒత్తుగా సైతం పెరుగుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube