వైరల్ అవుతున్న డిప్యూటీ సీఎం పవన్ తొలి ఇన్ స్టాగ్రామ్ పోస్ట్.. ఏం చెప్పారంటే?

సినీ నటుడిగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) జనసేన పార్టీని( Janasena Party ) స్థాపించి రాజకీయాలలో కూడా ఎంతో కృషి చేసి నేడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలను అందుకున్నారు.ఇటీవల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పొత్తు పెట్టుకుని ఎన్నికలలో పోటీ చేశారు.

 Pawan Kalyan First Instagram Post Goes Viral In Social Media Details Here , Pawa-TeluguStop.com

అయితే ఈ పొత్తులో భాగంగా జనసేన పోటీ చేసిన అన్ని స్థానాలలో కూడా అద్భుతమైన మెజారిటీతో గెలుపొందారు.ఇక పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురం ( Pitapuram ) నియోజకవర్గం నుంచి సుమారు 70000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

ఇక ఈయన భారీ మెజారిటీతో గెలవడంతో ఈయనకు ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ లో మంత్రిగా చోటు సంపాదించుకోవడమే కాకుండా ఉపముఖ్యమంత్రిగా కూడా బాధ్యతలు తీసుకున్నారు.ఇక జూన్ 19వ తేదీ పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రిగా, మంత్రిగా బాధ్యతలు తీసుకొని పలు కీలక ఫైళ్ళ పై సంతకాలు కూడా చేశారు.ఇలా రాజకీయ రంగంలో ఎంతో బిజీగా మారిన పవన్ కళ్యాణ్ తనకు సంబంధించిన ఏ విషయాన్ని అయినా కూడా జనసేన పార్టీ సోషల్ మీడియా ఖాతా నుంచి తెలియజేసేవారు కానీ ఎప్పుడూ కూడా తన వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతా ద్వారా ఎలాంటి విషయాలను తెలియజేసే వారు కాదు.

ఇక ఈయన ఉప ముఖ్యమంత్రిగా, మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటిసారి తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ నుంచి ఒక వీడియోని షేర్ చేశారు.ఇందులో భాగంగా ఈయన మంగళగిరిలోని పార్టీ ఆఫీసు నుంచి బయలుదేరి తన ఛాంబర్ లో ఉపముఖ్యమంత్రిగా మంత్రిగా బాధ్యతలు తీసుకున్నటువంటి కొన్ని సన్నివేశాలకు సంబంధించిన వీడియోని షేర్ చేశారు.ఇక ఈ వీడియోని షేర్ చేసిన పవన్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి & గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ, శాస్త్ర & సాంకేతిక శాఖల మంత్రిగా బాధ్యతలు తీసుకుంటున్నందుకు గౌరవంగా ఉంది.

ఇప్పుడు నాకు మరింత బాధ్యతలు పెరిగాయని, ఇకపై తాను నా రాష్ట్రం కోసం మరింత కష్టపడతానని ప్రతి ఒక్కరి భవిష్యత్తు కోసం కష్టపడి పని చేయడానికి తాను ఎదురు చూస్తున్నట్లు ఈయన చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube