ప్రశాంత్ నీల్ మూవీలో తారక్ క్యారెక్టర్ ఇదే.. నరరూప రాక్షసుడిగా కనిపిస్తారా?

టాలీవుడ్ హీరో గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్( Global star NTR ) ప్ర‌స్తుతం వ‌రుసగా సినిమాల‌లో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.ఒకవైపు కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర మూవీలో నటిస్తూనే మరొకవైపు బాలీవుడ్ చిత్రం వార్ 2లోనూ న‌టిస్తున్నారు.

 Ntr Prashanth Neel Dragon Movie Updates, Ntr,prashanth Neel, Dragon Movie, Tolly-TeluguStop.com

ఈ రెండు సినిమాల త‌రువాత ప్ర‌శాంత్ నీల్ ( Prashant Neil )ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ ఒక చిత్రంలో న‌టించ‌నున్న సంగ‌తి తెలిసిందే.ఎప్పటినుంచో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అనేక రకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా రూపుదిద్దుకోనుంది.ఆగ‌స్టు నుంచి ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంద‌ని ఇప్ప‌టికే చిత్ర బృందం వెల్ల‌డించిన విషయం తెలిసిందే.

Telugu Dragon, Ntrprashanth, Prashanth Neel, Tollywood-Movie

అయితే ఈ మధ్యకాలంలో ఈ సినిమాకు సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది.సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఒక్కొక్క వార్త సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి.ఇది ఇలా ఉంటే సినిమాకు డ్రాగన్ అనే పేరును పరిశీలిస్తున్నట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.ఆ సంగతి అటు ఉంచితే సోషల్ మీడియాలో ఈ సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్ కు సంబంధించిన విషయాలు వైరల్ గా మారాయి.

అవేమిటంటే.ఇందులో ఎన్టీఆర్ నెగిటివ్ క్యారెక్టర్ (negative character )లో కనిపిస్తారని సమాచారం.

Telugu Dragon, Ntrprashanth, Prashanth Neel, Tollywood-Movie

డ్రాగన్ టైటిల్ కి తగ్గట్టు ఈ ఇందులో ఎన్టీఆర్ క్యారెక్టర్ ని డిజైన్ చేశాడట ప్రశాంత్ నీల్.యూరోపియన్ కల్చర్ లో చెడుకి సింబల్ డ్రాగన్.మైథాలజీలో ఒక రాక్షసుడు.డ్రాగన్ కి అగ్గి పీల్చే గుణం వుంటుంది.అలాగే అలజడికి సింబాలిక్ గా డ్రాగన్ ని వాడుతారు.ఇవన్నీ ఎన్టీఆర్ క్యారెక్టర్ లో ఉండేట్లు డిజైన్ చేస్తున్నారు నీల్.

ఎన్టీఆర్ టెంపర్ లో నెగిటివ్ టచ్ వుండే పాత్ర చేశారట నీల్.అంటే ఇప్పుడు మరోసారి నెగిటివ్ రోల్ కి రెడీ అవుతున్నారు.

అయితే నీల్ హీరో ఎప్పుడూ విలనీ టచ్ లోనే ఉంటాడు.ఇప్పుడు ఎన్టీఆర్ తో కూడా ఒక విలనీ హీరోయిజం క్యారెక్టర్ నే ప్లాన్ చేశారట.

ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ వార్త విన్న అభిమానులు నిజమా అని కొంతమంది ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube