ఇదేందయ్యా ఇది.. రొట్టెలు చేస్తున్న స్పైడర్ మ్యాన్... వీడియో వైరల్!

అందరికీ తెలిసిన సూపర్‌హీరో స్పైడర్‌మ్యాన్ ( Superhero Spiderman )తన అద్భుత శక్తులతో ప్రపంచాన్ని కాపాడుతుంటాడు.కానీ ఇటీవల ఒక ఊహించని సంఘటనలో, స్పైడర్‌మ్యాన్ భారతదేశానికి వచ్చి ఒక ఫన్నీ పరిస్థితిలో చిక్కుకున్నాడు.

 This Is The Video Of Spider-man Making Bread Viral, Spider-man, Superhero, India-TeluguStop.com

దానికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.ఇందులో స్పైడర్‌మ్యాన్ కాస్ట్యూమ్ ధరించిన ఒక వ్యక్తి రొట్టెలు చేస్తున్నట్లు కనిపిస్తున్నాడు.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.“ప్రపంచాన్ని కాపాడటం వల్ల కడుపు నిండదు.” అనే క్యాప్షన్‌తో ఈ వీడియో షేర్ అయింది.ఇందులో స్పైడర్‌మ్యాన్ ఒక టెర్రస్‌పై కూర్చొని, రొట్టెలు చేస్తున్నాడు.

అతను చాలా నైపుణ్యంతో రొట్టెలు చేస్తాడు.ఈ క్లిప్ చూసిన తర్వాత నవ్వకుండా ఉండలేం.

ఈ వీడియో భారతదేశంలో చాలా చర్చనీయాంశమైంది.చాలా మంది ఈ వీడియో చూసి నవ్వుకుంటున్నారు.కొంతమంది స్పైడర్‌మ్యాన్‌కు కూడా రొట్టెలు చేయడం తెలుసా అని ఆశ్చర్యపోతున్నారు.ఈ వీడియో మనకు ఒక విషయాన్ని గుర్తు చేస్తుంది.సూపర్‌హీరోలు కూడా మానవులే.వారికి కూడా మనలాంటి అవసరాలు, కోరికలు ఉన్నాయి.

వీడియోలో, స్పైడర్‌మ్యాన్ వేషం వేసుకున్న వ్యక్తి ఎండలో టెర్రస్‌పై కూర్చొని, పొయ్యి మీద రొట్టెలు చేస్తున్నాడు.ముందు పిండిని చపాతీలా చేసి, దానిని వేడి చేసే పెనంపై వేసి, చేతులతో తిప్పుతూ ఉంటాడు.

అతను పాదాల నుంచి తల వరకు స్పైడర్‌మ్యాన్ డ్రెస్‌నే వేసుకున్నాడు.వీడియోలో రాసినట్లు అతను జైపూర్‌వాడు( Jaipur ) కావచ్చు కానీ, అతని ఊరు లేదా పేరు గురించి కచ్చితమైన వివరాలు తెలియ రాలేదు.

ఈ వీడియో చాలా త్వరగా వైరల్ అయ్యింది.ఆరు లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి, వెయ్యికి పైగా షేర్లు అయ్యాయి.నాలుగు వేల మందికి పైగా లైక్ చేశారు, ఎనిమిది వందలకు పైగా మంది సేవ్ చేశారు.ఈ వీడియో చూసిన వాళ్లు వారి వారి రియాక్షన్లు కామెంట్స్ రూపంలో పంచుకున్నారు.

కొంతమంది ఎండలో ఆ డ్రెస్ వేసుకుని ఉండటం చూసి ఔరా అనుకున్నారు.మరికొంతమంది ఈ వీడియో హాలీవుడ్‌కు పంపించాలని ఆశ్చర్యంగా కామెంట్ చేశారు.

వేరొక వ్యక్తి స్పైడర్‌మ్యాన్ ఎప్పుడు రొట్టెలు తినడం మొదలు పెట్టాడని హాస్యాస్పదంగా అడిగాడు.ఇంకొకరు స్పైడర్‌మ్యాన్ ఎప్పుడు ఇండియాకు వచ్చాడని అడిగాడు.

సూపర్‌హీరోలు కూడా వాళ్లు తినే తిండిని వాళ్ళే వండుకోవాలి అని మరొక వ్యక్తి సరదాగా కామెంట్ చేశాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube