ఒకేసారి ఆరు ఫ్లాట్స్ ను కొనుగోలు చేసిన బాలీవుడ్ స్టార్ హీరో.. ఏం జరిగిందంటే?

బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్( Abhishek Bachchan ) గురించి మనందరికీ తెలిసిందే.బాలీవుడ్ లో ఎన్నో సినిమాలలో నటించి హీరోగా తన కంటికి ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకున్నారు అభిషేక్ బచ్చన్.

 Abhishek Bachchan Buy Six Flats Once And Cost , Abhishek Bachchan, Buy Six Flats-TeluguStop.com

ఇప్పటికీ వరుసగా సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.ఇకపోతే మామూలుగా సెలబ్రిటీలు స్థలాలు లేదా ఇల్లు కొనుగోలు చేసినప్పుడు ఒకటి లేదా రెండు కొనుగోలు చేస్తూ ఉంటారు.

కానీ తాజాగా అభిషేక్ బచ్చన్ కొనుగోలు చేసిన ఇల్లు చూసి అభిమానులు నోరెళ్ళ పెడుతున్నారు.

ఇంతకీ అభిషేక్ బచ్చన్ ఎన్ని ప్లాట్స్ కొనుగోలు చేశారు వాటి ధర ఎంత? ఎక్కడ కొనుగోలు చేశారు అన్న వివరాల్లోకి వెళితే.బాలీవుడ్ స్టార్ హీరో( Bollywood star hero ) అభిషేక్ బచ్చన్ ఒకేసారి ఏకంగా ఆరు ఫ్లాట్స్ కొనుగోలు చేశాడు.దీంతో అందరూ అవాక్కవుతున్నారు.

కాగా తాజాగా ముంబైలోని బొరివాలి సబ్బరన్ ప్రాంతంలో ప్రముఖ రియల్ ఎస్టేట్‌కి సంబంధించిన అపార్ట్‌మెంట్‌లో ఆరు ఫ్లాట్స్ కొనుగోలు చేశాడు.ఇవన్నీ కూడా 57వ అంతస్థులో ఉన్నాయి.ఇందులో రెండు ఫ్లాట్స్ ధర చెరో రూ.79 లక్షలు కాగా మిగిలిన నాలుగు కూడా తలో ఫ్లాట్ రూ.3.5 కోట్లు విలువ చేసేవి.

మొత్తంగా చూసుకుంటే అభిషేక్ బచ్చన్ వీటి కోసం రూ.15 కోట్లు ఖర్చు చేశాడు.గత నెల 28నే కొనుగోలు పూర్తవగా, 29న రిజిస్ట్రేషన్ పూర్తయిందని తెలుస్తోంది.ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో డబ్బు ఉన్నవారు ఏమైనా కొనుగోలు చేస్తారు అంటూ కొందరు కామెంట్లు వ్యక్తం చేస్తుండగా మరికొందరు ఒకేసారి ఐదు ప్లాట్స్ నా అంటూ షాక్ అవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube