వృద్ధుడిగా వేషం మార్చి భారత్ నుంచి కెనడాకు ప్రయాణించేందుకు ప్రయత్నించిన 24 ఏళ్ల యువకుడిని ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు అదుపులోకి తీసుకున్నారు.నిందితుడిని గురుసేవక్ సింగ్‌గా( Gursewak Singh ) గుర్తించారు.
ఇతను జుట్టు, గడ్డానికి తెల్లరంగు వేసి వృద్ధుడిగా( Elderly Man ) వేషం మార్చి మంగళవారం సాయంత్రం ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని( Indira Gandhi International Airport ) టెర్మినల్ 3 వద్ద అనుమానాస్పదంగా కనిపించాడు.దీంతో అక్కడ భద్రతా విధుల్లో ఉన్న సీఐఎస్ఎఫ్ సిబ్బంది గురుసేవక్‌ను అడ్డగించి.
ఢిల్లీ పోలీసులకు అప్పగించారు.
ఈ ఘటనపై ఓ సీనియర్ అధికారి మీడియాతో మాట్లాడుతూ.గురుసేవక్ తొలుత అనుమానాస్పదంగా కనిపించడంతో సీఐఎస్ఎఫ్ సిబ్బంది అతడిని తనిఖీ చేసినట్లు తెలిపారు.అతను తన గుర్తింపు పత్రాల కోసం .తన పేరును పాస్‌పోర్ట్‌లో రష్‌విందర్ సహోటా (67)గా( Rashvindar Sahota ) పేర్కొన్నాడు.గురుసేవక్ ఢిల్లీ నుంచి బయల్దేరే ఎయిర్ కెనడా విమానంలో( Air Canada Flight ) ఎక్కాల్సి ఉందని సదరు అధికారి వెల్లడించారు.
పాస్‌పోర్టులో( Passport ) పేర్కొన్న వివరాలతో పోల్చి చూసినప్పుడు గురుసేవక్ రూపం, గొంతు, అతని చర్మం, శరీర ఆకృతి చిన్న వయసు వ్యక్తిలా కనిపించాయని ఆ అధికారి పేర్కొన్నారు.అనుమానమొచ్చి నిశితంగా పరిశీలించగా.
అతను తన జుట్టు, గడ్డానికి తెల్ల రంగు వేసుకున్నాడని, పెద్ద వయస్కుడిగా కనిపించడానికి గాజులు ధరించినట్లు ఆయన చెప్పారు.
సీఐఎస్ఎఫ్ సిబ్బంది నుంచి అదుపులోకి తీసుకున్న అనంతరం ఢిల్లీ పోలీసులు( Delhi Police ) గురుసేవక్ సింగ్‌ను తమదైన శైలిలో ప్రశ్నించారు.దీంతో తన వయసు, అసలు పేరును వెల్లడించినట్లు ఆ అధికారి పేర్కొన్నారు.గురుసేవక్ సింగ్ , 24 పేరుతో ఉన్న పాస్‌పోర్ట్‌ను అధికారులు అతని మొబైల్ ఫోన్‌లో కనుగొన్నారు.
నకిలీ పాస్‌పోర్ట్, మోసపూరిత ప్రయాణం కేసు కావడంతో ఢిల్లీ పోలీసులు ఈ వ్యవహారంపై సీరియస్‌గా దృష్టి సారించారు.అయితే గురుసేవక్ సింగ్ వేషం మార్చి వృద్ధుడిలా కెనడాకు ఎందుకు వెళ్లాలనుకున్నాడనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.