రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని గొల్లపల్లి బస్టాండ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గొల్లపల్లి గ్రామానికి చెందిన బీడీ టేకేడర్ ఊరడి మహేష్ అనే యువకుడు దుర్మరణం చెందాడు.ప్రమాదంతో సిరిసిల్ల కామారెడ్డి ప్రధాన రహదారి అయిన గొల్లపల్లి బస్టాండ్ చౌరస్తా రక్త సిక్తం అయింది.
బీడీ టేకేడర్ అయిన మహేష్ తన బైక్ పై గొల్లపల్లి గ్రామంలోని ఇంటికి వెళ్లే క్రమంలోగొల్లపల్లి చౌరస్తా వద్ద నున్న డివైడర్ దాటి గ్రామంలోకి వెళ్ళు తుండగా భారీ కంటేనర్ మహేష్ బైక్ ను డీ కొట్టింది.
బైక్ పైనున్న మహేష్ కంటేనర్ క్రింద పడటంతో మహేష్ తలపై నుండి కంటేనర్ టైర్లు వెళ్లడంతో మహేష్ తల పగిలి మెదడు చిట్లి పోయింది.
ఈ ప్రమాదంలో మహేష్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు.ప్రమాద సమాచారము తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున సంఘటన స్థలానికి చేరుకున్నారు.దీంతో గొల్లపల్లి బస్టాండ్ వద్ద ట్రాఫిక్ స్థంభించింది.ప్రమాద సమాచారం తెలుసుకున్న ఎల్లారెడ్డి పేట సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గౌడ్, ఎస్ ఐ రమాకాంత్,ఏ ఎస్ ఐ కిషన్ రావులు పోలీస్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ ఇబ్బందులు కలుగ కుండా చర్యలు చేపట్టారు.
ప్రమాద సంఘటనకు సంభందించిన వివరాలు తెలుసుకొని కేసు నమోదు చేశారు.మృత దేహానికి పంచ నామా నిర్వహించి పోస్ట్ మార్టం కై మృత దేహాన్ని సిరిసిల్ల ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదానికి కారణమయిన కంటేనర్ ను స్వాధీనం చేసుకొని ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.మృతునికి భార్య ఇద్దరు పిల్లలున్నారు.బందు మిత్రుల రోధనలతో గొల్ల పల్లి బస్టాండ్ ప్రాంతం, గొల్లపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.