క్లీంకార మా జీవితాల్లో ఆనందాన్ని నింపింది.. ఉపాసన ఆసక్తికర పోస్ట్ వైరల్!

టాలీవుడ్ క్యూట్ కపుల్స్ లో ఒకరైన రాంచరణ్ ,ఉపాసన( Ramcharan, Upasana ) దంపతుల గురించి మనందరికీ తెలిసిందే.ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఎంతో అన్యంగా ఉంటూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తూ ఉంటారు.

 Upasana Shares An Emotional Video To Wishes Klinkara, Klinkara, Upasana, Klinkar-TeluguStop.com

ఉపాసన ఒకవైపు అపోలో హాస్పిటల్ బాధ్యతలు, మెగా కోడలుగా కూడా బాధ్యతలు నిర్వహిస్తుండగా మరోవైపు రాంచరణ్ వరుసగా పాన్ ఇండియా మూవీలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు.ఇక సమయం దొరికినప్పుడల్లా ఈ జంట ముద్దుల కూతురు గారాల పట్టి అయినా క్లీంకారతో సమయాన్ని గడుపుతూ ఉంటారు.

ఇది ఇలా ఉంటే నేడు క్లీంకార ( Klinkara )మొదటి పుట్టినరోజు నేడు.దీంతో ఆ చిన్నారికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.ఈ సందర్భంగా తన కుమార్తెకు విషెస్‌ చెబుతూ ఉపాసన ఒక ఎమోషనల్‌ వీడియో షేర్‌ చేశారు.నా ప్రియమైన క్లీంకారకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నీ రాకతో మా జీవితాలు పరిపూర్ణమయ్యాయి.మా జీవితాల్లో ఆనందం నింపినందుకు ధన్యవాదాలు అని కూతురికి స్పెషల్ బర్త్డే విషెస్ తెలిపింది ఉపాసన.

కాగా ఉపాసన షేర్ చేసిన ఆ వీడియోలో చరణ్‌ ఉపాసనలతో పాటు ఇరు కుటుంబాల వారు కూడా ఉన్నారు.

వారు క్లీంకార పుట్టినప్పటి రోజులను గుర్తుచేసుకున్నారు.పాప పుట్టిన సమయంలో తమ కుటుంబంలో ఎలాంటి సందడి వాతావరణం నెలకొందో అన్న అంశాన్ని ఈ వీడియోలో చూపించారు.క్లీంకార నామకరణ కార్యక్రమానికి సంబంధించిన కొన్ని విజువల్స్‌ సైతం అందులో ఉన్నాయి.

కాగా క్లీంకార పుట్టినరోజు సందర్భంగా అభిమానులు నెటిజన్స్ సెలబ్రిటీలు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube