గల్ఫ్ దేశం కువైట్లో( Kuwait ) జరిగిన అగ్నిప్రమాద ఘటన యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.ఈ దుర్ఘటనలో 50 మంది ప్రాణాలు కోల్పోగా.
వారిలో 46 మంది భారతీయులే కావడం దురదృష్టకరం.ఘటనను సీరియస్గా తీసుకున్న కువైట్ ప్రభుత్వం, పోలీసులు .ఇది మానవ తప్పిదమా లేక ప్రమాదవశాత్తూ జరిగిందా అన్న కోణంలో విచారిస్తున్నారు.ఈ ఘటనలో ప్రమేయం ఉన్న 8 మందిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు.
వీరిలో ముగ్గురు భారతీయులు,( Three Indians ) నలుగురు ఈజిప్షియన్లు,( Four Egyptians ) ఒక కువైట్ పౌరుడు ఉన్నట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి.అరెస్ట్ అయిన వారిని రెండు వారాల పాటు నిర్బంధించాలని పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆదేశించినట్లుగా ఆంగ్ల భాషా దినపత్రిక అరబ్ టైమ్స్ నివేదించింది.
నిందితులపై నరహత్య, నిర్లక్ష్యంగా వ్యవహరించడం వంటి అభియోగాలను మోపినట్లు వెల్లడించింది.ప్రమాద ఘటనపై కువైట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ విచారణ ప్రారంభించారు.

జూలై 12న మంగాఫ్ నగరంలోని( Mangaf ) ఆరు అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.గ్రౌండ్ ఫ్లోర్లోని గార్డు గదిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్( Electric Short Circuit ) కారణంగానే ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.ప్రమాద సమయంలో అందులో 195 మంది వలస కార్మికులు నివసిస్తుండగా.వీరిలో ఎక్కువ మంది భారతీయులే.బాధిత కుటుంబాలకు కువైట్ ఎమిర్, షేక్ మెషల్ అల్ అహ్మద్ అల్ జాబర్ అల్ సబాహ్ ఆదేశాల మేరకు ఒక్కొక్కరికి 15 వేల డాలర్లు (భారత కరెన్సీలో 12.5 లక్షలు) నష్టపరిహారంగా అందజేయనున్నారు.

పరిహారం చెల్లింపులను ప్రాసెస్ చేసి బాధితుల రాయబార కార్యాలయాలకు అందజేస్తారని అరబ్ టైమ్ వెల్లడించింది.మరణించిన వారిలో 46 మంది భారతీయులు కాగా, ముగ్గురు ఫిలిప్పీన్స్ జాతీయులు , మరొకరి గుర్తింపు తెలియాల్సి ఉంది.సంబంధిత రాయబార కార్యాలయాలు అగ్నిప్రమాదంలో( Fire Accident ) ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నిధులు పంపిణీ చేసేలా పర్యవేక్షించనున్నాయి.