వీడియో: బీచ్‌లో గిన్నె కింద టపాస్ పెట్టి పేల్చింది.. చివరికి దిమ్మతిరిగిపోయింది..??

ఇన్‌స్టాగ్రామ్‌లో ఫన్నీ వీడియోలు చాలా ఉన్నాయి.ఇష్టం వచ్చినట్లు చేసి నవ్వించడం లేదా ఫేమస్ అవ్వాలనే ఉద్దేశ్యంతో వీటిని చేస్తారు.

 In The Video, She Put Tapas Under The Bowl On The Beach And Blew It Up, Firecrac-TeluguStop.com

ఇలాంటి ఓ వీడియోలో బీచ్‌లో ఉన్న ఓ మహిళా ఓ గిన్నె కింద ఫైర్ క్రాకర్ లేదా రాకెట్ పెట్టి నిప్పంటుకుంటుంది.కానీ ఏమీ జరగకపోవడంతో దగ్గరగా వెళ్లి చూడబోతుంది.

గిన్నె దగ్గరకు వెళ్ళేసరికి టపాస్ బలంగా పేలి, గిన్నె ఆమె ముఖానికి గట్టిగా తగులుతుంది.దెబ్బకు ఆమె ఇసుకలో పడిపోయి, గడ్డం నొప్పితో ఏడుస్తూ ఉంటుంది.

వీడియో ఎక్కడ తీశారో తెలియదు కానీ ఇది ఒక ఫారిన్ కంట్రీలో ( foreign country )జరిగినట్టు తెలుస్తోంది.దీనికి 3 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి.

ఈ వీడియోపై చాలా విమర్శలు వచ్చాయి.కొంతమంది యూజర్లు, ఫేమస్( Users, famous ) అవ్వాలనుకునే వాళ్లు చేసే డ్రామా ప్రాణాల మీదకి తీసుకొస్తుందని కొందరు తిట్టారు.దీనికి బదులు వేరే పని చూసుకోమని ఆమెను విమర్శించారు.మరొకరు, ఇది సరదా వీడియో కాదు, ముఖానికి గాయాలు అయ్యేంత ప్రమాదకరమని అన్నారు.ఇలాంటి వీడియోలు చూసి ఇంకొందరు కూడా ఇలాంటి ప్రమాదకరమైన పనులు చేయడానికి ప్రయత్నించే ప్రమాదం ఉందని, సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు పెట్టడం ఎంతో అవివేకమని మరొకరు చెప్పారు.

ఇదే సోషల్ మీడియా పిచ్చి వల్ల మరో ఘటనలో, కాలిఫోర్నియాలోని టస్టిన్‌కు( Tustin, California ) చెందిన 35 ఏళ్ల లనా క్లే-మోనాఘన్( Lana Clay-Monaghan ) అనే మహిళ గాయపడింది.ఎవరో ఆమె తలపై బకెట్ పెట్టి, ఆమె కళ్లు, చెవులు మూసివేశారు.దీంతో ఆమె స్పృహ కోల్పోయి పడిపోయింది.

ఆసుపత్రిలో ఆమెకు గుండె సమస్య వల్ల స్పృహతప్పినట్లు వైద్యులు నిర్ధారించారు.ఆ రోజే ఆమెను డిశ్చార్జ్ చేసి, పోలీసులకు ఫిర్యాదు చేశారు.

టస్టిన్ పోలీసులు, నలుగురు యువకులు క్లే-మోనాఘన్ తలపై బకెట్ పెట్టి పారిపోయినట్లు చూశారని తెలిపారు.ఆ యువకులను ఇంకా గుర్తించలేదు.

ఈ ఘటన సోషల్ మీడియా పిచ్చి వల్ల ఎంత ప్రమాదం ఉందో, ఎంత తీవ్రమైన పరిణామాలు ఉండొచ్చో చాటి చెబుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube