శ్రీజ జీవితాన్ని నాశనం చేసింది వాళ్లే.. వైరల్ అవుతున్న పవన్ ఓల్డ్ కామెంట్స్!

మెగాస్టార్ చిరంజీవి మాజీ అల్లుడు శిరీష్ భరద్వాజ్( Sirish Bhardwaj ) అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించిన సంగతి తెలిసిందే.చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ, శిరీష్ ప్రేమ వివాహం చేసుకున్నారు.

 Pawan Kalyan Comments About Sreeja Details Here Goes Viral In Social Media ,sir-TeluguStop.com

శ్రీజ మెగా ఫ్యామిలీని( Sreeja mega family ) కాదని 2007వ సంవత్సరంలో తాను ప్రేమించిన వ్యక్తి శిరీష్ తో వెళ్లి ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకున్నారు.ఇలా మెగా ఫ్యామిలీ నుంచి బయటకు వెళ్లిపోయిన ఈమె ప్రేమ వివాహం చేసుకోవడమే కాకుండా మా కుటుంబం నుంచి తనకు ప్రాణహాని ఉంది అంటూ స్టేట్మెంట్ ఇవ్వటం అప్పట్లో సంచలనగా మారింది.

Telugu Chiranjeevi, Pawan Kalyan, Pawankalyan, Sirish Bhardwaj, Sreeja-Movie

అప్పుడప్పుడే చిరంజీవి( Chiranjeevi ) కూడా రాజకీయాలలోకి వస్తున్నటువంటి తరుణంలో శ్రీజ ప్రేమ వివాహం చేసుకోవడంతో ఈ విషయం కాస్త హాట్ టాపిక్ గా మారింది.అయితే శ్రీజ వివాహం చేసుకున్న తర్వాత ఒక పాప జన్మించిన అనంతరం తనకు తన భర్త నుంచి వేధింపులు ఎక్కువయ్యాయని విడాకులు ఇచ్చి తన తండ్రి వద్దకు చేరుకున్నారు.ఇక ఇటీవల శిరీష్ అనారోగ్యంతో మరణించడంతో కొన్ని ఓల్డ్ వీడియోస్ కూడా ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Telugu Chiranjeevi, Pawan Kalyan, Pawankalyan, Sirish Bhardwaj, Sreeja-Movie

ఇక శ్రీజ ఇంట్లో నుంచి వెళ్లిపోయి ప్రేమ వివాహం చేసుకోవడంతో మెగా ఫ్యామిలీలో చిరంజీవి సైలెంట్ గా ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ మాత్రం ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు.పలు సందర్భాలలో ఈ విషయం గురించి ఈయన మాట్లాడుతూ చేసిన కొన్ని వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఈ క్రమంలోనే ఒక పబ్లిక్ మీటింగ్ లో శ్రీజ గురించి పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

పవన్ కళ్యాణ్ చిరంజీవి రాజకీయాలలోకి వచ్చిన తరువాత కొంతమంది కాంగ్రెస్ నేతలు భయపడ్డారని అందుకే తమ ఇంటి ఆడబిడ్డను అడ్డుగా పెట్టుకొని రాజకీయాలు చేశారని అన్నారు .ఇలా మా ఇంటి ఆడ బిడ్డను అడ్డుపెట్టుకొని మా పరువు బజారు కీడ్చి ఢిల్లీలో రియాలిటీ షోలు చేశారని ఈయన మండిపడ్డారు.మేము రాజకీయాలలోకి వస్తే వారికి ఎందుకు అంత భయం అంటూ పవన్ ప్రశ్నిస్తూ చేసిన వీడియో వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube