ఆ విషయంలో దీపికని ఎంత మెచ్చుకున్నా తక్కువే.. రెస్పెక్ట్ ను పెంచుకున్నారుగా!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే( Deepika Padukone ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.బాలీవుడ్ లో ఎన్నో సినిమాలలో నటించి హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకుంది దీపికా.

 Prabhas Fans Go Crazy As Actor Says Deepika, Deepika Padukone, Bollywood, Fans P-TeluguStop.com

ఇకపోతే దీపికా పదుకొనే హీరోయిన్ గా నటించిన తాజా చిత్రం కల్కి.నాగ్ అశ్విన్( Nag Ashwin ) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటించిన విషయం తెలిసిందే.

ఈ సినిమా ఈ నెల 27న విడుదల కానుంది.కాగా గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో దీపికా పదుకొనే కల్కి సినిమా ప్రమోషన్స్ కి రాదేమో అని చాలామంది సందేహం వ్యక్తం చేశారు.

దీపికా పదుకొనె కల్కి( Kalki ) షూటింగ్ పూర్తి కాగానే ఆమె ప్రెగ్నెంట్ అయ్యింది.దాంతో కల్కి ప్రమోషన్స్ కి రాకపోవచ్చని ప్రచారం గట్టిగానే జరిగింది.కల్కి బుజ్జి కార్ రివీల్ ఈవెంట్ కి దీపికా హైదరాబాద్ రాలేదు.సో ఆమె ఇక కల్కి ప్రమోషన్స్ లో పాల్గొనదు అనుకుంటున్నారు.కానీ దీపికా పదుకొనె అందరి అనుమానాల్ని పటాపంచలు చేసేసింది.ముంబై లో జరిగిన కల్కి ఈవెంట్ లో దీపికా పదుకొనే హాజరైంది.

అది కూడా బేబీ బంప్ తో దీపికా కల్కి ప్రమోషన్స్ కి రావడం, ప్రభాస్ ని, కల్కి చిత్ర దర్శకుడు నాగిని పొగడడం ప్రభాస్ అభిమానులని విపరీతంగా ఆకట్టుకుంది.

ప్రభాస్ ఫ్యాన్స్ అయితే దీపికా డెడికేషన్ కి ఫిదా అవుతున్నారు.ఆమె ప్రెగ్నెంట్ అయినా, బేబీ బంప్ తో ఇబ్బంది పడుతున్నా చాలా యాక్టీవ్ గా కల్కి ప్రమోషన్స్ కి రావడం పట్ల చాలామంది దీపికా పై రెస్పెక్ట్ పెరిగింది అంటున్నారు.అంత డెడికేషన్ ఉంది కాబట్టే ఆమె టాప్ హీరోయిన్ అయ్యింది అంటూ ప్రశంసిస్తున్నారు.

ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube