మూడు ప్రపంచాల మధ్య కథ కల్కి.. నాగ్ అశ్విన్ చెప్పిన విషయాలతో అంచనాలు పెరిగాయిగా!

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ( Prabhas ) త్వరలోనే కల్కి 2898ఏడీ( Kalki 2898ad ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు నాగ్ అశ్విన్(Nag Aswin) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూన్ 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఇక ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ సైతం వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు ఇటీవల ఒక కార్యక్రమంలో భాగంగా ఈయన కల్కి సినిమా కథ గురించి చెబుతూ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను కూడా పెంచేశారు.

 Prabhas Kalki Movie Story Line Details Here Goes Viral In Social Media , Prabhas-TeluguStop.com
Telugu Complex, Kalki, Kashi, Prabhas, Prabhaskalki, Shambaala-Movie

ఈ సినిమా కథ గురించి నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.కల్కి కథ రాయడానికి నాకు ఐదు సంవత్సరాల సమయం పట్టిందని తెలిపారు.అంతేకాకుండా ఈ సినిమా కథ కాశీ( Kashi ) , కాంప్లెక్స్( Complex ) , శంబాలా( Shambaala ) అనే మూడు ప్రపంచాల మధ్య కొనసాగుతుందని డైరెక్టర్ తెలియజేశారు.పవిత్రమైన గంగా నది ఒడ్డున ఉన్న కాశీ ఈ ప్రపంచంలోనే మొదటి నగరం అని అనేక పుస్తకాలలో, శాసనాలలో కూడా ఉంది.

ఇకపోతే నాగరికత పుట్టుక కూడా ఇక్కడి నుంచే మొదలైందని శాసనాలు చెబుతున్నాయి.

Telugu Complex, Kalki, Kashi, Prabhas, Prabhaskalki, Shambaala-Movie

ఇలా మొదటి నగరం అయినటువంటి కాశీనే చివరి నగరం అయితే ఎలా ఉంటుందనే ఒక ఆలోచన నుంచి పుట్టినదే ఈ సినిమా కథ అని ఈయన తెలిపారు.ఈ విధంగా నాగ్ అశ్విన్ ఈ సినిమా కథలో ఈ మూడు ప్రపంచాలు ఒకదానితో ఒకటి ఎలా భాగమయ్యాయి తెలిపేదే ఈ సినిమా కథ అంటూ డైరెక్టర్ చేసిన కామెంట్స్ సినిమాపై అంచనాలను భారీ స్థాయిలో పెంచేసాయి.మరి ఈ సినిమా ఎలా ఉండబోతోంది ఏంటి అనే విషయాలు తెలియాలి అంటే జూన్ 27వ తేదీ వరకు వేచి చూడాలి.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ రివ్యూలు కూడా చాలా పాజిటివ్ గానే రావడంతో ప్రభాస్ అభిమానులు ఈ సినిమా కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube