మూడు ప్రపంచాల మధ్య కథ కల్కి.. నాగ్ అశ్విన్ చెప్పిన విషయాలతో అంచనాలు పెరిగాయిగా!

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ( Prabhas ) త్వరలోనే కల్కి 2898ఏడీ( Kalki 2898ad ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు నాగ్ అశ్విన్(Nag Aswin) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూన్ 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఇక ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ సైతం వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు ఇటీవల ఒక కార్యక్రమంలో భాగంగా ఈయన కల్కి సినిమా కథ గురించి చెబుతూ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను కూడా పెంచేశారు.

"""/" / ఈ సినిమా కథ గురించి నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.కల్కి కథ రాయడానికి నాకు ఐదు సంవత్సరాల సమయం పట్టిందని తెలిపారు.

అంతేకాకుండా ఈ సినిమా కథ కాశీ( Kashi ) , కాంప్లెక్స్( Complex ) , శంబాలా( Shambaala ) అనే మూడు ప్రపంచాల మధ్య కొనసాగుతుందని డైరెక్టర్ తెలియజేశారు.

పవిత్రమైన గంగా నది ఒడ్డున ఉన్న కాశీ ఈ ప్రపంచంలోనే మొదటి నగరం అని అనేక పుస్తకాలలో, శాసనాలలో కూడా ఉంది.

ఇకపోతే నాగరికత పుట్టుక కూడా ఇక్కడి నుంచే మొదలైందని శాసనాలు చెబుతున్నాయి. """/" / ఇలా మొదటి నగరం అయినటువంటి కాశీనే చివరి నగరం అయితే ఎలా ఉంటుందనే ఒక ఆలోచన నుంచి పుట్టినదే ఈ సినిమా కథ అని ఈయన తెలిపారు.

ఈ విధంగా నాగ్ అశ్విన్ ఈ సినిమా కథలో ఈ మూడు ప్రపంచాలు ఒకదానితో ఒకటి ఎలా భాగమయ్యాయి తెలిపేదే ఈ సినిమా కథ అంటూ డైరెక్టర్ చేసిన కామెంట్స్ సినిమాపై అంచనాలను భారీ స్థాయిలో పెంచేసాయి.

మరి ఈ సినిమా ఎలా ఉండబోతోంది ఏంటి అనే విషయాలు తెలియాలి అంటే జూన్ 27వ తేదీ వరకు వేచి చూడాలి.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ రివ్యూలు కూడా చాలా పాజిటివ్ గానే రావడంతో ప్రభాస్ అభిమానులు ఈ సినిమా కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

రోజు నైట్ ఈ న్యాచురల్ సీరంను వాడితే మచ్చలేని చర్మం మీ సొంతమవుతుంది!