వైరల్ వీడియో: అమరావతి శంకుస్థాపన వేదికకు మోకాళ్లపై కూర్చొని నమస్కరించిన సీఎం..

2024 లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికల్లో భాగంగా టీడీపీ( TDP ) కూటమి అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాల్గవసారి నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలను చేపట్టారు.

 Viral Video Amaravati Cm Bowed Down On His Knees At The Foundation Stone Foundat-TeluguStop.com

ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజధాని అమరావతిలో ఆయన ప్రస్తుతం పర్యటిస్తున్నారు.రెండో క్షేత్రస్థాయి పర్యటనలను సీఎం చంద్రబాబు( CM Chandrababu ) అమరావతిలో చేపట్టారు.

ఇదివరకు వైసిపి ప్రభుత్వం ఉండవల్లిలో ఉన్న ప్రజావేదికను కూల్చిన ప్రదేశం నుండి రాజధాని పర్యటనను మొదలుపెట్టారు.అంతేకాకుండా ప్రజావేదిక శిథిలాలను కూడా సీఎం పరిశీలించారు.

ఆపై అమరావతి రాజధాని నిర్మాణాలను పరిశీలన చేశారు.ఈ సమయంలో అనుకొని ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియోలో సీఎం చంద్రబాబు నాయుడు మోకాళ్లపై కూర్చొని ఉద్దండరాయని పాలెంలో శంకుస్థాపన వేదికకు( Uddandarayani Palem ) నమస్కరించారు.మట్టి, నీరు సేకరించి ప్రదర్శనకు ఉంచిన ప్రాంతాన్ని ఆయన సందర్శించారు.అక్కడ చేరుకున్న తర్వాత కొబ్బరికాయ కొట్టి పూజలు కూడా మొదలుపెట్టారు.ఆ సమయంలో అక్కడి ప్రాంత రైతులు జై అమరావతి.జై చంద్రబాబు.అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణ శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆయన సందర్శించారు.ఇదివరకు చంద్రబాబు ప్రభుత్వంలో చేసిన యాగశాలను కూడా ఆయన సందర్శించారు.

ఆ తర్వాత అక్కడే ఉన్న గృహ సముదాయాలను కూడా చంద్రబాబు నాయుడు సందర్శించారు.

పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ అధికారులతో తాను వస్తున్నానని ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయలేదు కదా అంటూ అడగడం అక్కడ అందరినీ ఆశ్చర్యపరిచింది.రాజధాని నిర్మాణం పనులు గురించి తనకి వాస్తవ పరిస్థితి కచ్చితంగా తెలియాలని ఆయన అధికారులతో తెలిపారు.ఇక అమరావతి ప్రాంతంలో ప్రజాప్రతినిధుల క్వార్టర్ల నిర్మాణం దాదాపు 80 శాతం మేర పూర్తయిందని.

, వాటికీ సంబంధించి లక్ష 46వేల చదరపు మీటర్ల ప్రాంతంలో ఏకంగా 421 కోట్లతో నిర్మాణం జరుగుతున్నట్లు సమాచారం.మొత్తంగా ప్రజాప్రతినిధుల నివాస సముదాయం మొత్తం 12 టవర్లలో ఉండనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube