టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి.మెగా కుటుంబం నుంచి ఇప్పటికే ఎంతోమంది హీరోలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.
అయితే మెగా డాటర్స్ సైతం ఇండస్ట్రీలో హీరోయిన్లు గాను, నిర్మాతలుగా కొనసాగుతున్న సంగతి మనకు తెలిసిందే.నిహారిక( Niharika ) ఒకవైపు నటిగా నటిస్తూనే మరోవైపు నిర్మాతగా కూడా పలు వెబ్ సిరీస్ లను సినిమాలను నిర్మిస్తూ ఉన్నారు.
అలాగే మెగా డాటర్ సుస్మిత( Susmitha ) సైతం నిర్మాతగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.ఈమె ఇండస్ట్రీ లోకి వచ్చిన మొదటిలో కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేశారు.
ఇలా తన తండ్రి చిరంజీవి అలాగే తమ్ముడు రామ్ చరణ్ సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తున్న సుస్మిత అనంతరం నిర్మాతగా మారి పలు సినిమాలు వెబ్ సిరీస్ లను నిర్మించారు.ఇకపోతే ఇటీవల తన గోల్డెన్ బాక్స్ నిర్మాణ సంస్థ ద్వారా పరువు( Paruvu ) అనే వెబ్ సిరీస్ నిర్మించారు.ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ జీ 5 లో ( Zee5 ) ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది.ప్రస్తుతం ప్రసారమవుతున్న ఈ సిరీస్ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది.
ఈ క్రమంలోనే తాజాగా ఈ సిరీస్ చూసిన చిరంజీవి( Chiranjeevi ) తన కుమార్తె పట్ల ప్రశంసలు కురిపిస్తూ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.అద్భుతమైన కంటెంట్‌తో సుస్మిత కొణిదెల ప్రొడ్యూస్ చేసిన ఈ ఓటీటీ సిరీస్ బాగుందని చిరంజీవి ట్వీట్ చేశాడు.సుస్మితను చూస్తుంటే గర్వంగా ఉందని ఈ ట్వీట్‌లో పేర్కొన్నాడు.ఇక నాగబాబు( Nagababu )నటన గురించి కూడా చిరంజీవి ప్రస్తావించారు.నాగబాబు నటన బ్రిలియంట్ అంటూ ఈయన మెచ్చుకున్నారు.ఇక ఈ సిరీస్ లో నాగబాబు మొదటి సారి నెగటివ్ పాత్రలో నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చారు.