ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం పై స్పష్టత ఇచ్చిన ఏపీ మంత్రి..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు( Chandrababu ) ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.

 Ap Minister Clarified On Free Rtc Bus Travel Details, Free Rtc Bus Travel, Cm C-TeluguStop.com

ఇప్పటికే మెగా డీఎస్సీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పెన్షన్ పెంపు, అన్నా క్యాంటీన్ ల పునరుద్ధరణ, నైపుణ్య గణన ఫైల్ పై సంతకం చేయడం జరిగింది.ఇదిలా ఉంటే ఎన్నికల ప్రచారంలో ఏపీ మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం( Free RTC Bus Journey ) హామీ కూడా ప్రకటించడం జరిగింది.

ఈ క్రమంలో మరో నెల రోజుల్లో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి( Minister Ramprasad Reddy ) తెలియజేశారు.గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీకి వేలాది కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నాయి.వాటిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.దీనిపై ఇప్పటికే ప్రభుత్వం కసరత్తు ప్రారంభించినట్లు స్పష్టం చేశారు.వైసీపీ హయాంలో ఒక కొత్త బస్సు కూడా కొనలేదు.ఉన్న బస్సులను యధావిధిగా కొనసాగించారు.

అయితే ఆర్టీసీ మనుగడ కాపాడేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.వచ్చే పదిహేను రోజుల్లో ఉచిత ప్రయాణం పై కమిటీ వేస్తామని స్పష్టం చేశారు.

అందరితో చర్చించి ప్రభుత్వంలో ఆర్టీసీ పూర్తి విలీనానికి చర్యలు చేపడతామని పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube